కొత్త పార్టీ ప్రకటించబోతున్న విజయ్ దళపతి, త్వరలో ఢిల్లీకి తమిళ స్టార్ హీరో ..?

Published : Jan 26, 2024, 07:33 PM ISTUpdated : Jan 29, 2024, 03:24 PM IST

కొత్త పార్టీని అనౌన్స్ చేయడానికి తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రెడీ అవుతున్నాడా..? అందుకే కార్యకర్తలతో మీటింగ్ కూడా పెట్టాడా..? తాజాగా తమిళనాట సంచలనంగా మారిన ఈ విషయంలో నిజం ఏంత..?   

PREV
19
కొత్త పార్టీ ప్రకటించబోతున్న  విజయ్ దళపతి, త్వరలో ఢిల్లీకి తమిళ స్టార్ హీరో ..?

తమిళనాట స్టార్  హీరోగా కొనసాగుతున్న విజయ్ దళపతి పొలిటికల్ గా  ఎంట్రీ ఇవ్వడంకోసం అంతా రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి అంతా సిద్దం చేసుకుంటున్నాడు. వచ్చే నెలలో ఢిల్లీ వెళ్ళి ఈసీని కూడా కలవబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.  పైకి ఏమీ లేదు అని చెపుతున్నా.. లోలోపన మాత్రం అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నాడట దళపతి. ఆయన నిర్వహిస్తున్న రహస్య సమావేశాటు విజయ్‌ రాజకీయ రంగప్రవేశం తథ్యం అని చెప్పేస్తున్నారు. దాదాపు నాలుగేళ్లుగా ఈ విషయంలో నాల్చుతున్న విజయ్ లోపల మాత్రం బ్యాగ్రౌండ్ వర్క్ గట్టిగా చేస్తున్నట్టు తెలుస్తోంది. 
 

29

చాలాకాలం క్రితమే ఈయన రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. ఆయన తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ కూడా విజయ్‌ అభిమానులతో టచ్ లో ఉంటూ... ఎప్పటికప్పుడు పర్యావేక్షిస్తున్నారు. తన తండ్రి  ప్రకటించి పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదు అనిచెపుతూనే విజయ్.. అదే ఫ్యాన్స్  సమావేశాలు నిర్వహించి మరింత జోష్‌ తెచ్చారు. కానీ తానంతట తాను మాత్రం బయటపడటంలేదు.  

39

విజయ్  రాజకీయ ఆరంగేట్రం పై చాలా కాలంగా డిస్కర్షన్ నడుస్తోంది. తమిళనాట కోట్లాది ఫ్యాన్స్ ను కలిగిఉన్న స్టార్ హీరో.. తమిళ రాజకీయల్లో చక్రంతిప్పుతారు అన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఇప్పటికే ఆయన తండ్రి, దర్శకుడు ఎస్‌ఎం. చంద్రశేఖర్‌ విజయ్‌  మక్కల్‌ ఇయక్కం అంటూ  రాజకీయ కార్యకలాపాలు మొదలుపెట్టారు కూడా.. 

49

ప్రస్తుతం  స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్న  విజయ్‌ వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే.. మరోపక్క అభిమానుల.. ప్రజలు ఇబ్బంది పడుతున్నవారి  అవసరాలను చూసుకుంటూ.. వాటిని  పూర్తి చేయాలని ఆదేశించారట. 
 

59

అంతే కాదు విజయ్‌ మక్కళ్‌ ఇయక్కమ్‌ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌ తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో కూడా పార్టీ కార్యక్రమాలు..  సేవా కార్యక్రమాలను విస్తృతం చేశారు. దాంతో  విజయ్ త్వరలోనే కొత్తపార్టీ ప్రారంభించబోతున్నట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేవిధంగా రీసెంట్ గా ఓ  ఘటన చెన్నైలో జరిగింది. పనయూర్‌లోని తన కార్యాలయంలో విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో విజయ్ సమావేశం నిర్వహించారు. 

69

అసలు తనకు సబంధం లేదు అని చెప్పిన వారితే.. విజయ్ సమావేశం నిర్వహించడంతో విషయంపై పెద్ద చర్చ మొదలయ్యింది.చెన్నై, కోవై, తిరుచ్చి, మధురై సహా అన్ని జిల్లాల నుంచి 150 మంది  ఈ సమావేశంలో  పాల్గొన్నట్టు తెలుస్తోంది. అంతే కాదు.. సమావేశం వాడీ వేడిగా జరగడంతో పాటు.. విజయ్ రాజకీయ పార్టీ ప్రారంభించాల్సిందేనని డిమాండ్ ను వారు గట్టిగా చేసినట్టు తెలుస్తోంది. 

79

విజయ్ కూడా గతానికి భిన్నంగా రాజకీయాలపై చర్చించినట్టు తెలిపారు. అంతేకాదు, మరో ఆరు నెలల్లో ఆయన కొత్త పార్టీ ప్రారంభించబోతున్నట్టు కూడా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. పార్టీ పేరు ఖరారు చేసి నమోదు చేసిన తర్వాత త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏదైనా పార్టీకి మద్దతివ్వాలా? లేదంటే ఒంటరిగా బరిలోకి దిగాలా? అన్న అంశంపై ఇంకోసారి చర్చిస్తారని వార్తలు బయటకు వస్తున్నాయి. 
 

89

అంతే కాదు విజయ్ ఆమధ్య  రాజకీయ హ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను హైదరాబాద్ లో రహస్యంగా కలిశారని.. తన రాజకీయ ఆరంగేట్రం గురించే చర్చ జరిగినట్టు టాక్ గట్టిగా నడిచింది. దాంతో  దళపతి సీక్రేట్ గా తన పొలిటికల్ ఎంట్రీని ప్లాన్ చేస్తున్నట్టు తమిళనాట వార్తలు గుప్పుమంటున్నాయి. 
 

99
Thalapathy Vijay

ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. విజయ్ రాజకీయ ప్రవేశం కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అటు విజయ్ కాంత్ మరణం తరువాత తమిళనాటు సినీరాజకీయంలో ఒక ముఖ్యమైన పాత్ర మిస్ అయ్యింది. విజయ్ దళపతి ఎంట్రీతో అది పూర్తి అవుతుందని భావిస్తున్నారు. విజయ్ పార్టీ స్టార్ట్ అయితే.. అది భారీ ఎత్తున  ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

click me!

Recommended Stories