2025లో చాలా వరకు మంచి సినిమాలు వస్తున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన కొన్ని చిత్రాలు నిరాశ పరిచినా, చాలా వరకు మంచి విజయాలు సాధిస్తున్నాయి. తక్కువ బడ్జెట్ మూవీస్ ఆడియెన్స్ ని సర్‌ప్రైజ్ చేస్తున్నాయి.
ఇక ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోయాయి. ఈ ఆరు నెలలు తమిళ సినిమాల్లో చిన్న చిత్రాలు సత్తా చాటాయి. తాజాగా ధనుష్ నటించిన `కుబేర` మూవీ వసూళ్ల పరంగా మంచి ఆదరణ పొందింది.
ఇది ఇప్పుడు వంద కోట్లు దాటింది. మరి ఈ సందర్బంగా ఈ ఏడాది వంద కోట్లు దాటిన తమిళ చిత్రాలెన్నో చూద్దాం. ఇందులో క్రేజీ చిత్రాలుండటం విశేషం.
25
`పట్టుదల` మొదటి వంద కోట్ల మూవీ, కానీ డిజాస్టర్
2025లో మొదటి 100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమా `విడముయర్చి`(పట్టుదల). మగిజ్ తిరుమేని దర్శకత్వంలో అజిత్, త్రిష, అర్జున్, ఆరవ్ నటించిన ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలైంది. లైకా ఈ సినిమాను నిర్మించింది. అనిరుధ్ సంగీతం అందించారు.
ఈ సినిమా రూ. 137 కోట్లు వసూలు చేసినా, ఈ ఏడాది అతిపెద్ద ఫ్లాప్ సినిమాగా నిలిచింది. 250 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా దాదాపు 100 కోట్లు నష్టాన్ని మిగిల్చింది. ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్‌గా ఈ మూవీ వచ్చింది.
35
`డ్రాగన్`తో సర్‌ప్రైజ్ చేసిన ప్రదీప్ రంగనాథన్
`లవ్ టుడే` సినిమా విజయం తర్వాత ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన సినిమా `డ్రాగన్`. ఏజీఎస్ ఈ సినిమాను నిర్మించింది. ప్రదీప్ కి జోడీగా అనుపమ పరమేశ్వరన్, కాయాదు లోహర్ నటించారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు.
ఈ ఏడాది మొదటి బ్లాక్ బస్టర్ హిట్ డ్రాగన్. రూ.37 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది. ఫేక్ సర్టిపికేట్స్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది.
2025లో రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాల్లో అజిత్ `గుడ్ బ్యాడ్ అగ్లీ` ఒకటి. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. అజిత్ తో పాటు అర్జున్ దాస్, త్రిష, ప్రియా వారియర్ నటించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
ఏప్రిల్ లో విడుదలైన ఈ సినిమా రూ. 240 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా `గుడ్ బ్యాడ్ అగ్లీ` నిలిచింది. అజిత్‌కి మంచి బూస్ట్ ఇచ్చింది. ఇందులో అజిత్ వింటేజ్ లుక్‌లో కనిపించారు. ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చారు.
55
`కుబేర`తో ధనుష్ మళ్లీ ఫామ్‌లోకి
ఇక తాజాగా ధనుష్ నటించిన `కుబేర` కూడా చేరింది. మంగళవారంతో ఈ చిత్రం వంద కోట్ల కలెక్షన్లని దాటింది. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు.
నాగార్జున, రష్మిక మందన్న ముఖ్య పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. జూన్ 20న విడుదలైన కుబేరా ఐదు రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసింది.
అయితే ఇది తెలుగు మూవీగానే ప్రొజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ చిత్రానికి తమిళంలో చాలా తక్కువ వసూళ్లని రాబట్టింది. ధనుష్ హీరోగా అక్కడ తక్కువ కలెక్షన్లు రావడం షాకిస్తుంది.