ఇక మంగళవారం( జూన్ 23) ఉదయం వరకు కూడా శృతి హాసన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పోస్ట్ ను పెట్టారు. వాతావరణం ఇంత చల్లగా ఉంది, వర్షం వస్తున్నప్పుడు , ఇంత సంతోషంగా, ఉత్సాహంగా, సానుకూలంగా ఉండేది నేనొక్కదాన్నేనా?... ఇలాంటి వాతావరణం నాతో నేను ఏదైనా రాయాలనిపిస్తుంది, మనసులను కదిలించాలనిపిస్తుంది" అనే పోస్టును ఆమె షేర్ చేసింది.
ఈ నేపథ్యంలో అకౌంట్ హ్యాకింగ్ విషయం వెలుగులోకి రావడం, అలాగే ఆమె ఆ పోస్టు తరువాత ఈ అకౌంట్ లో వచ్చిన అసాధారణ కంటెంట్ అభిమానులను గందరగోళానికి గురిచేసింది. గతంలో కూడా చాలామంది సెలబ్రిటీలకు ఇదే పరిస్థితి ఎదురయ్యింది.
ఇక జాతీయ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు డి. ఇమాన్ అకౌంట్ కూడా 2024 మార్చిలో హ్యాకయ్యింది. ఆ తరువాత అకౌంట్ ను తిరిగి పునరుద్ధరించారు. అంతకుముందు నటి, రాజకీయ నాయకురాలైన ఖుష్బూ సుందర్ సోషల్ మీడియా పేజ్ కూడా, రెండు మూడు సార్లు హ్యాక్ అయ్యింది. ఇలా సెలబ్రిటీల అకౌంట్లపై సైబర్ దాడులు జరుగుతూనే ఉన్నాయి.