ఫస్ట్ మూవీతోనే 100 కోట్లు కొల్లగొట్టిన యంగ్ హీరో ఎవరో తెలుసా?

Published : Feb 20, 2025, 04:31 PM IST

నువ్వు హీరో ఏంటి అన్నారు, ఇండస్ట్రీలో తొక్కేయడానికి చూశారు. అయినా సరే తన టాలెంట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. వచ్చి రావడంతోనే 100 కోట్ల సినిమా ఇచ్చాడు యంగ్ హీరో. ఇంతకీ అతను ఎవరు?   

PREV
15
ఫస్ట్ మూవీతోనే  100 కోట్లు కొల్లగొట్టిన యంగ్ హీరో ఎవరో తెలుసా?
తొలి సినిమాతోనే 100 కోట్ల వసూళ్లు

స్టార్ హీరోలకు మాత్రమే సాధ్య 100 కోట్ల కలెక్షన్లు ఇచ్చే సినిమా చేేయాలి అంటే. కాని అది అపోహ మాత్రమే అని నిరూపించాడో ఓయంగ్ హీరో. 100 కోట్ల కలెక్షన్ అంటే  మిగతా హీరోలకు అది అందనంత ఎత్తులో ఉండేది. చాలామంది హీరోలు చాలా ఏళ్ల తర్వాత ఆ ఫీట్ సాధించారు. అయితే ఒక హీరో మాత్రం మొదటి సినిమాతోనే రూ.100 కోట్లు కొట్టేశాడు. ఇంతకీ అతను ఎవరు..?

Also Read: మోహన్ బాబుకు ఇష్టమైన కొడుకు ఎవరు? మంచు విష్ణు, మనోజ్ ఆస్తి గొడవల్లో ఆయన ఎవరి వైపు

25
ప్రదీప్ రంగనాథన్

ఆ నటుడు మరెవరో కాదు... ప్రదీప్ రంగనాథన్. ఇంజినీరింగ్ అయిపోయాక సినిమా మీద ఇష్టంతో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసి పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత జయం రవి ఒక షార్ట్ ఫిల్మ్ చూసి ఇంప్రెస్ అయి, తనతో పనిచేయాలని అనుకున్నాడు. ప్రదీప్ రంగనాథన్ తీసిన 'కోమాళి' సినిమా అలా వచ్చిందే.

 

35
లవ్ టుడే హీరో

మొదటి సినిమా హిట్ అయితే రెండో సినిమాకి ఈజీగా ఛాన్స్ వస్తుంది. కానీ ప్రదీప్ విషయంలో అలా జరగలేదు. 'లవ్ టుడే' కథ విని చాలామంది హీరోలు వద్దన్నారు. దాంతో ప్రదీప్ తానే హీరోగా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఏజీఎస్ సంస్థ ఆ సినిమాను నిర్మించింది. తను తీసిన 'ఆఫ్ లాక్' అనే షార్ట్ ఫిల్మ్ ఆధారంగా 'లవ్ టుడే' సినిమా తీశాడు ప్రదీప్.

45
లవ్ టుడే 100 కోట్ల వసూళ్లు

సినిమా బాగా ఉండటంతో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. 2022లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో తీస్తే రూ.100 కోట్లు రావడంతో నిర్మాతలకు కూడా మంచి లాభం వచ్చింది. అలా మొదటి సినిమాతోనే రూ.100 కోట్లు కొల్లగొట్టిన హీరోగా ప్రదీప్ రికార్డు క్రియేట్ చేశాడు.

55
ప్రదీప్ రంగనాథన్ మూవీ లైన్ అప్

ప్రస్తుతం ప్రదీప్ మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. అశ్వత్ మారిముత్తు డైరెక్షన్‌లో 'డ్రాగన్' అనే సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ అవుతోంది. విఘ్నేష్ శివన్ డైరెక్షన్‌లో 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇది సమ్మర్ లో రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. దాని షూటింగ్ కూడా ఫాస్ట్ గా జరుగుతోంది.

 

Read more Photos on
click me!

Recommended Stories