అయితే ఈ విషయంలో ఇద్దరు కొడుకుల్లో మోహన్ బాబు సపోర్ట్ మాత్రం పెద్ద కొడుకు విష్ణుకే ఇస్తున్నారు. అయితే అటు మనోజ్ మాత్రం తన తండ్రి తప్పులేదని.. అతన్ని మాన్యూప్లేట్ చేస్తూ.. తనపై ద్వేశాన్ని నింపుతున్నారని విష్ణును ఉద్దేశించి ఇండైరెక్ట్ గా అంటున్నాడు
. మోహన్ బాబుకు ఇద్దరు కొండుకులంటే ఇష్టమే... కాని ఈ విషయంలో మాత్రం సపోర్ట్ పెద్ద కొడుక్కే. అంతే కాదు మంచు మనోజ్ తన ఇంటిని ఖాళీ చేయాలని మోహన్ బాబు నోటీసులు కూడా ఇచ్చాడు. చిన్న కొడుకుపై కోపంతో ఉన్న మోహన్ బాబు.
అతన్ని ఇంటి నుంచి బయటకు పంపించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మరి వీరి విషయం ఎంత దూరం వెళ్తుందో చూడాలి. హైదరాబాద్ నుంచి ఈ ఇష్యూ తిరుపతి చేరింది. మరి అక్కడైనా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా లేదా అనేది చూడాలి.