జోకర్ మూవీ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ జపాన్ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. అందాల భామ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించగా.. అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా తమిళ, తెలుగు భాషల్లో దీపావళి కానుకగా నవంబర్ 10న గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజైంది.