ఇక తేజస్విని ఇంట్లో నుంచి బయటకి వెళ్లే ముందు పల్లవి ప్రశాంత్ తో ఆసక్తికర సంభాషణ జరిగింది. పల్లవి ప్రశాంత్, అమర్ ఎక్కువగా గొడవ పడటం చూస్తూనే ఉన్నాం. దీనితో పల్లవి ప్రశాంత్ అన్న విషయంలో నన్ను ఏమి అనుకోవద్దు అని కోరాడు. అలాంటిది ఏమీ లేదు. మీరంతా బాగానే ఉన్నారు కదా .. బాగా ఆడండి అని తేజస్విని తెలిపింది.