కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ధనుష్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

First Published | Feb 20, 2023, 1:55 PM IST

తమిళ స్టార్ హీరో ధనుష్ రెండేండ్ల కింద ప్రారంభించిన డ్రీమ్ హౌజ్ నిర్మాణం పూర్తైంది. తాజాగా గృహప్రవేశ కార్యక్రమం జరిగింది. ఆ ఫొటోలు వైరల్ గా మారాయి. ఈక్రమంలో ఆ ఇంటి ధర ఆసక్తికరంగా మారింది. 
 

చెన్నైలో అత్యంత ధనవంతులు ఉండే పోయిస్ గార్డెన్ లో తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నారు. రెండేండ్ల కిందనే ఇంటి నిర్మాణ పనులు చేపట్టగా ఇటీవల పూర్తయ్యాయి. ఈ సందర్భంగా  తాజాగా గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. 

గతంలోనే ధనుష్ రూ.25 కోట్లతో పోయిస్ గార్డెన్ లో స్థలం కొనుగోలు చేయగా.. 2021 ఫిబ్రవరిలో ఇంటి నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.  ఈ కార్యక్రమానికి అప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్, ఐశ్వర్య, కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకే ధనుష్ - ఐశ్వర్య విడిపోయారు. కానీ ఇంటి నిర్మాణాన్ని మాత్రం ఆపలేదు. 


అన్ని హంగులతో నిర్మించిన విలాసవంతమైన ఇంటి నిర్మాణం పూర్తి కావడంతో.. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యలతో కలిసి తాజాగా గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ధనుష్ అభిమాన సంఘం అధ్యక్షుడు సుబ్రమణ్యం శివ కొత్త ఇంట్లో దిగిన ఫొటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

అయితే, ధనుష్ ఎప్పటినుంచో మంచి ఇంటిని నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారంట. దీంతో భారీ వ్యయంతో ఈ ఇంటిని  నిర్మించ తలపెట్టారంట. ఒకరంగా ఇది ధనుష్ డ్రీమ్ హౌజ్ అని కూడా చెప్పొచ్చని అంటున్నారు. ఇందుకోసం ఏకంగా రూ.150 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించారని తెలుస్తోంది. 

తాజా ఇంటిని నిర్మాణ పనులు ప్రారంభించినప్పుడు ధనుష్.. ఐశ్వర్య కలిసి ఇక్కడే ఉండాలని భావించారంట. ప్రస్తుతం విడిపోవడంతో అది అలాగే మిగిలిపోయింది. దీంతో ఇంటిని తల్లిదండ్రులకు బహూకరించారని సన్నిహితుల నుంచి సమాచారం. ఇక రజినీ కాంత్ వీరిద్దరినీ కలిపేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ధనుష్ ఫ్యాన్స్ కూడా బలంగా కోరుకుంటున్నారు. 
 

ధనుష్ నటించిన తాజా చిత్రం  ‘సార్’ విడుదలైన మంచి  టాక్ ను సొంతం చేసుకుంది. తెలుగులో ధనుష్ కిది డెబ్యూ ఫిల్మ్. అప్పటికే తెలుగు ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉండటం విశేషం. ఈ చిత్రంతో తన ఫ్యాన్స్ ను, ఆడియెన్స్ ను మరింతగా ఆకట్టుకుంటున్నారు. అటు బాక్సాఫీస్ వద్ద కూడా అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నారు. నెక్ట్స్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగులోనే నటించబోతున్నారు. 
 

Latest Videos

click me!