Tamannaah: కర్నాటకలోని మైసూర్ సాండల్ సోప్ వివాదంలో తమన్నా పేరు వినిపించిన నేపథ్యంలో ఇప్పుడు ఆమె రాజకీయ ఎంట్రీకి సంబంధించిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. మిల్కీ బ్యూటీ తన మనసులో మాటని బయటపెట్టింది.
మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల సినిమాలు చాలా సెలక్టీవ్‌గా చేస్తోంది. అదే సమయంలో బోల్డ్ రోల్స్ కి రెడీ అవుతుంది. స్పెషల్ సాంగ్స్ తో మెరుస్తుంది. తెలుగులో కంటే హిందీలో బిజీగా ఉంది తమన్నా. కంటెంట్ ఉన్న చిత్రాలు, తన పాత్రకి ప్రయారిటీ ఉన్న మూవీస్ ఎక్కువగా చేస్తోంది. నటిగా తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో తమన్నాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
26
కర్నాటక మైసూర్ సాండల్ సోప్ వివాదంలో తమన్నా
తమన్నా ఇటీవల కర్నాటక రాజకీయా వివాదంలో ఇరుక్కొంది. ఆమె కర్నాటక ప్రభుత్వానికి చెందిన మైసూర్ సాండల్ సోప్ కి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యింది. ఈ సోప్‌ని నార్త్ జనాలకు కూడా రీచ్ అయ్యేందుకు, దీని మార్కెట్‌ని విస్తరించేందుకు తమన్నాని బ్రాండ్ అంబాసిడర్‌ని చేసింది అక్కడి ప్రభుత్వం. కానీ దీనిపై విమర్శలు వచ్చాయి. కన్నడ హీరోయిన్లు ఉండగా, నార్త్ అమ్మాయిని ఎందుకు తీసుకున్నానే విమర్శలు వచ్చాయి. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. కానీ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు.
36
భారీ పారితోషికం తీసుకున్న తమన్నా
దీంతో కన్నడ రాజకీయ వివాదంలో తమన్నా ఇరుక్కుంది. అయితే దీనిపై ఆమె మౌనంగానే ఉంది. తన పని తాను చేసుకుపోయింది. తమన్నా ఈ సోప్ కి బ్రాండ్ అంబాసిడర్‌గా రెండేళ్లపాటు ఉంటుంది. అందుకుగానూ ఆరున్నర కోట్ల పారితోషికం తీసుకుందట. ఇది కూడా వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో తమన్నాకి సంబంధించిన ఒక విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆసక్తిని రేకెత్తిస్తుంది.
తమన్నా రాజకీయాలపై ఆసక్తిని చూపిస్తోంది. ఆరేళ్ల క్రితమే తన మనసులో మాటని బయటపెట్టింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని, అవేంటో తెలియదని, రాజకీయాల్లోకి రావాలంటే చాలా బాధ్యత ఉండాలని చెప్పింది. అయితే భవిష్యత్‌లో రాజకీయాల గురించి తెలుసుకొని వస్తానేమో అని ఏడేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ తర్వాత సమంతతో మాట్లాడుతూ, మరో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. తాను రాజకీయాల్లోకి వస్తుందనే రూమర్ నిజమైతే బాగుండు అని చెప్పింది.
56
రాజకీయాల్లోకి వస్తుందనేది నిజమైతే బాగుండు
తమన్నా.. సమంత నిర్వహించిన సామ్ జామ్ షోకి వెళ్లింది. ఇందులో సామ్.. ఈ రూమర్లలో ఏది నిజమైతే బాగుండు అని నువ్వు ఫీలవుతావని అడిగింది. అందులో.. 1.తమన్నా కోస్టార్‌తో గొడవ పడింది, 2,తమన్నా రాజకీయాల్లోకి వస్తుంది. 3,తమన్నా రిపోర్టర్స్ తో రూడ్‌గా మాట్లాడింది. ఈ మూడింటిలో ఏది నిజమైతే బాగుండు అని సమంత ప్రశ్నించగా, తాను రాజకీయాల్లోకి వస్తుందనేది నిజమైతే బాగుంటుందని, ఏదైనా సేవ చేయడానికి పవర్ ఉంటుందని చెప్పింది తమన్నా. మొత్తంగా తన మనసులో మాటని బయటపెట్టింది. ఈ క్రమంలో ఇప్పుడు ఆమె చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇది ఆమెకి మనసులో హ్యాపీ అయ్యే విషయమనే చెప్పొచ్చు.
66
తమన్నా సినిమాలు
తమన్నా.. చివరగా `ఓ రోమియో` అనే హిందీ మూవీలో మెరిసింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన రాబట్టుకుంది. అంతకు ముందు `ఓడెల 2`లో ప్రధాన పాత్రలో నటించింది. ఇది కూడా ఆడలేదు. ఇప్పుడు `బోల్ చుడియన్` అనే చిత్రంలో నటిస్తుంది. స్పెషల్ సాంగ్స్, బోల్డ్ రోల్స్ కి రెడీగా ఉంటోంది మిల్కీ బ్యూటీ.