తమన్నా తెలుగులో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో నటించింది. అదే విధంగా ఆమె కెరీర్ లో ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. తెలుగు స్టార్స్ తో ఆమె చేసిన ఫ్లాప్ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మిల్కీ బ్యూటీ తమన్నాకి సౌత్ లో నెమ్మదిగా అవకాశాలు తగ్గుతున్నాయి. బాలీవుడ్ లోనే ఆమె ఎక్కువగా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఇటీవల ఆమె సౌత్ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. సౌత్ లో హీరోయిన్లకు అంతగా ప్రాధాన్యం ఉండదు అంటూ తమన్నా కామెంట్స్ చేసింది. కానీ తమన్నా స్టార్ స్టేటస్ ఎక్కువగా అనుభవించింది సౌత్ లోనే అని, అలాంటిది సౌత్ ఇండస్ట్రీనిని తక్కువ చేసి మాట్లాడడం ఏంటి అంటూ అభిమానులు ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో తమన్నా తెలుగులో నటించిన సినిమాల గురించి చర్చ జరుగుతోంది. తమన్నా కెరీర్ లో ఎన్ని సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయో అదే రేంజ్ లో చెత్త సినిమాలు కూడా ఉన్నాయి. తమన్నా టాలీవుడ్ లో చేసిన టాప్ 5 డిజాస్టర్స్ సినిమాల లిస్ట్ ఇప్పుడు చూద్దాం.
26
ఊసరవెల్లి
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి జోడీగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తమన్నా నటించిన మూవీ ఊసరవెల్లి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో తమన్నా లుక్స్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి.
36
రెబల్
రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన మూవీ రెబల్. ఈ మూవీలో కృష్ణంరాజు కీలక పాత్రలో నటించారు. తమన్నా హీరోయిన్. ఈ మూవీలో దర్శకుడు తమన్నా చేత చేయించిన నటన చాలా అతిగా అనిపించింది. సాంగ్స్ అయితే దారుణంగా ఉంటాయి. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది.
డైరెక్టర్ శ్రీనువైట్లకు ఆగడు నుంచే ఫ్లాపులు మొదలయ్యాయి. ఈ సినిమా దెబ్బకు ఇంతవరకు శ్రీను వైట్ల కోలుకోలేదు. అసలు తమన్నా ఈ చిత్రం ఎందుకు ఒప్పుకుందా అనిపించేలా ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది.
56
ఎఫ్3
అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమా కమర్షియల్ గా సేఫ్ అయింది. కానీ ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. సెకండ్ హాఫ్ లో ఈ కామెడీ సీన్లు, తమన్నా లుక్ ప్రేక్షకులకు ఎబ్బెట్టుగా అనిపించాయి.
66
భోళా శంకర్
తమన్నా ఎందుకు చేసిందా అనిపించే సినిమాల్లో ఇది కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా నటించిన ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకుడు. కాలం చెల్లిన వేదాళం సినిమాకి రీమేక్ చేయడమే పెద్ద తప్పు అయితే.. దాంట్లో చెత్త సన్నివేశాలు జోడించడం ఇంకో తప్పు. ఫలితంగా ఈ సినిమాపై దారుణంగా ట్రోలింగ్ జరిగింది.