‘బబ్లీ బౌన్సర్’ రెడీ.. వినాయకుడి మండపంలో మిల్క్ బ్యూటీ.. డైరెక్టర్ తో కలిసి ప్రత్యేక పూజలు..

First Published Sep 3, 2022, 4:09 PM IST

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మధుర్ బండార్కర్, మిల్ బ్యూటీ తమన్నా భాటియా కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘బబ్లీ బౌన్సర్’. ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉండగా.. తాజాగా వీరిద్దరు గణేషుడికి ప్రత్యేక పూజలు చేశారు. 

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) తన హిందీ ఫిల్మ్ ‘బబ్లీ బౌన్సర్’తో తర్వలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ స్పోర్ట్స్ మూవీని బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మ‌ధుర్ భండార్క‌ర్ (Madhur Bhandarkar) డైరెక్టర్ చేశారు. కేవలం నాలుగు నెలల్లోనే చిత్రీకరణ పూర్తి చేశారు. 
 

ప్రస్తుతం Babli Bouncer చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని ఓటీటీ సంస్థ ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ (Disney plus Hotstar)లో సెప్టెంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా యూనిట్ ప్రమోషన్స్ ను ప్రారంభించినట్టు తెలుస్తోంది. తాజాగా తమన్నా, మధుర్ బండార్కర్ గణనాథుడికి కలిసి పూజలు కూడా నిర్వహించారు. 
 

ముంబైలోని లాల్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన ప్రసిద్ధి లాల్ బాగ్చా రాజా గణేష్ మండపాన్ని ఈరోజు హీరోయిన్ తమన్నా, దర్శకుడు మధుర్ బండార్కర్ కలిసి సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఆ ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. 
 

గణనాథుడి పూజతోనే ‘బబ్లీ బౌన్సర్’ చిత్ర ప్రమోషన్స్ ను ప్రారంభించారు. చిత్రాన్ని ఓటీటీ వేదికన మరికొద్ది రోజుల్లో రిలీజ్ చేస్తుండటంతో ప్రచార కార్యక్రమాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్స్ రాలేదు. ఇకపై క్రేజీ అప్డేట్స్ తో సినిమాను ప్రమోట్ చేయనున్నారు. 
 

బాక్స‌ర్స్ టౌన్ గా పేరొందిన అసోలా ఫ‌తైపూర్ బ్యాక్ డ్రాప్ లో.. బాక్సింగ్ నేప‌థ్యంలో ‘బబ్లీ బౌన్సర్’ సినిమాను రూపొందించినట్టు తెలుస్తోంది. మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా మ‌హిళా బౌన్స‌ర్ గా న‌టించింది. దేశంలో తొలిసారిగా మ‌హిళా బౌన్స‌ర్ క‌థ ఆధారంగా వ‌స్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. 

చిత్రానికి మధుర్ భండాస్కర్ దర్శకత్వం వహించగా, కథ, స్క్రీన్ ప్లేను అమిత్ జోషి, ఆరాధన, మధుర్ చూసుకున్నారు. స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. సెప్టెంబర్ 23న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. తనిష్క్ బాగ్చీ, కరణ్ మల్హోత్రా సంగీతం అందిస్తున్నారు. 

click me!