తమన్నా ఇప్పుడు కన్నడనాట చిచ్చు పెట్టింది. మైసూర్ సాండల్ సోప్‌కి ఆమె ప్రచారకర్తగా నియమితులైన నేపథ్యంలో అక్కడ పెద్ద వివాదం నడుస్తోంది. దీనికితోడు ఆమె తీసుకుంటున్న పారితోషికం మరింత హీటెక్కిస్తుంది.
మిల్కీ బ్యూటీ ఇప్పుడు సినిమాల కంటే స్పెషల్ సాంగ్స్ తోనే బిజీగా ఉంటుంది. గడిచిన మూడేళ్లలో ఆమె తెలుగులో రెండే చిత్రాల్లో నటించింది. అవి కూడా పరాజయం చెందాయి. హిందీలోనూ అడపాదడపా చేస్తోంది. రొటీన్, రెగ్యూలర్ గ్లామర్స్ రోల్స్ చేయడం లేదు. దాన్ని మించిన ఇంటెన్సిటీ ఉన్న పాత్రలు, బోల్డ్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. సంచలనంగా మారుతుంది. అయితే ఇప్పుడు మరో రూపంలో సంచలనంగా మారింది. వివాదంలో ఇరుక్కుంది.
25
మైసూర్ సాండల్ సోల్ ప్రచారకర్తగా తమన్నా
తమన్నా ప్రస్తుతం కర్నాటకకి చెందిన మైసూర్ సాండల్ సోప్ ని ప్రమోట్ చేస్తుంది. ఇది కర్నాటక స్టేట్ గవర్నమెంట్ ఉత్పత్తి చేస్తోన్న సాంప్రదాయ సబ్బు. చాలా పాపులర్‌గా ఉంది. చాలా కాలంగా రన్నింగ్‌లో ఉంది. దీన్ని విస్తరించే బాధ్యతలు చేపట్టింది ప్రభుత్వం. అందుకు కొన్ని మార్పులు చేశారు. అదే సమయంలో మార్కెట్‌ని విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా తమన్నాని ప్రచారకర్తగా నియమించారు. రెండేళ్లపాటు తమన్నా ఈ మైసూర్ సాండల్ సోప్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారు.
35
మైసూర్ సాండల్ సోప్ వివాదం
ఇటీవలే ఈ కొత్త సోప్ ని ప్రారంభించారు. అయితే ఇప్పుడిది వివాదంగా మారింది. సొంత రాష్ట్రం కర్నాటకలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. స్టార్స్ ఉన్నారు. వారిని కాదని నార్త్ కి చెందిన హీరోయిన్‌ని ప్రచార కర్తగా నియమించడం పట్ల కన్నడీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. సొంత రాష్ట్రానికి చెందిన స్టార్స్ ని ప్రచారకర్తలుగా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు కన్నడనాట పెద్ద దుమారం రేపుతుంది.
ఇలాంటి వివాదాల మధ్య తమన్నా ఈ సోప్ యాడ్ కోసం తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలిస్తే మాత్రం మతిపోవాల్సిందే. సాధారణంగా ఇలాంటి యాడ్స్ కి కోటి, రెండు కోట్లు, మహా అయితే మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. కానీ ఈ సోప్ ని ప్రమోట్ చేస్తున్నందుకు తమన్నా తీసుకుంటున్న పారితోషికం తెలిస్తే మతిపోవాల్సిందే. ఏకంగా రూ.6.2కోట్లు తీసుకుందని సమాచారం. తమన్నా ఒక్కో మూవీకి కూడా అంత తీసుకోవడం లేదు. అందులో సగమే ఉంటుంది. కానీ ఇప్పుడు డబుల్ పేమెంట్ రావడం ఆశ్చర్యపరుస్తుంది. సొంత రాష్ట్రానికి చెందిన అమ్మాయి కాదు, పైగా ఇంత రెమ్యూనరేషన్ అనేది కూడా కన్నడ ప్రజలకు మరింతగా మండేలా చేస్తుంది.
55
తమన్నాని ప్రచారకర్తగా తీసుకోవడానికి కారణమిదే
అయితే తమన్నాని ప్రచారకర్తగా నియమించడానికి ఓ కారణం ఉందట. తమన్నా నార్త్ లో బాగా పాపులర్. ఆమె ఈ సోప్‌ని ప్రమోట్ చేస్తే ఉత్తరాధి ప్రజలకు కూడా చేరువవుతుంది, మార్కెట్ విస్తరిస్తుందని కన్నడ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. సోప్ మార్కెట్‌ని విస్తరించే ఉద్దేశ్యంలో భాగంగానే తమన్నాని తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇక తమన్నా ప్రస్తుతం తమన్నాకి తెలుగులో ఒక్క మూవీ కూడా లేదు. తమిళంలో ఓ మూవీ, హిందీలో ఐదు సినిమాలున్నాయి.