Thamannaah, Nagababu and Sekhar Master : తమన్నా టాలీవుడ్ లో మొన్నటి వరకు తిరుగులేని హీరోయిన్ గా కొనసాగింది. ప్రస్తుతం ఆమెకి సౌత్ లో అప్పుడప్పుడూ మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. గ్లామర్ తో స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్లలో తమన్నా ఒకరు.
Thamannaah, Nagababu and Sekhar Master : తమన్నా టాలీవుడ్ లో మొన్నటి వరకు తిరుగులేని హీరోయిన్ గా కొనసాగింది. ప్రస్తుతం ఆమెకి సౌత్ లో అప్పుడప్పుడూ మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. గ్లామర్ తో స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్లలో తమన్నా ఒకరు. ప్రస్తుతం సినీ తారలు బుల్లితెరపై షోలు చేయడం ట్రెండ్ గా మారింది. టాక్ షోలు, డ్యాన్స్ షోలు, రియాలిటీ షోలని స్టార్లు హోస్ట్ చేస్తున్నారు.
నాగార్జున బిగ్ బాస్ షోకి, బాలయ్య అన్ స్టాపబుల్ షోకి హోస్ట్ గా చేస్తున్నారు. రానా దగ్గుబాటి, హన్సిక లాంటి వారంతా బుల్లితెరపై సందడి చేస్తున్నారు. బుల్లితెరపై యాంకర్లుగా రాణించిన ఆ తర్వాత నటులుగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కొందరు స్టార్లు తాము చేస్తున్న షోలని మధ్యలోనే వదిలేసి వివాదాలకు కారణం అయ్యారు. ఆ జాబితాలో తమన్నా, నాగబాబు, శేఖర్ మాస్టర్ లాంటి వాళ్ళు ఉన్నారు.
27
Tamannaah
తమన్నా : మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మాస్టర్ చెఫ్ సీజన్ 1 షోతో బుల్లితెరపై అడుగుపెట్టింది. కానీ తమన్నా పేమెంట్ వివాదం వల్ల ఆ షోకి మధ్యలోనే పంగనామాలు పెట్టింది. తమన్నా అలా చేయడం కాంట్రవర్సీకి దారితీసింది. ఇస్తానన్న పేమెంట్ ని యాజమాన్యం ఇవ్వకపోవడం వల్లే తమన్నా ఆ షోని మానేసినట్లు వార్తలు వచ్చాయి.
37
Nagababu
నాగబాబు : మెగా బ్రదర్ నాగబాబు కొణిదెల జబర్దస్త్ షోకి దాదాపు ఏడేళ్లు జడ్జిగా వ్యవహరించారు. కానీ యాజమాన్యంతో విభేదించిన నాగబాబు మధ్యలోనే ఈ షోకి దూరమయ్యారు. జబర్దస్త్ అనేది తెలుగు బుల్లితెర చరిత్రలో ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఈ షోకి అత్యధిక టిఆర్పి రేటింగ్స్ నమోదయ్యాయి. యాజమాన్యంతో వివిధ అంశాలపై తనకు పొత్తు కుదరలేదని నాగబాబు అనేక కారణాలు చెప్పారు.
47
Sekhar Master
శేఖర్ మాస్టర్ : టాలీవుడ్ లో పాపులర్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ లో శేఖర్ మాస్టర్ ఒకరు. శేఖర్ మాస్టర్ ఢీ తో పాటు అనేక బుల్లితెర ప్రోగ్రామ్స్ లో సందడి చేస్తున్నారు. అయితే శేఖర్ మాస్టర్ అప్పట్లో ఢీ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ షోని మధ్యలోనే వదిలేశారు. మరొక పాపులర్ ఛానల్ లో అవకాశం కోసం శేఖర్ మాస్టర్ ఈ షోని వదిలేశారని విమర్శలు వచ్చాయి.
57
Anasuya Bharadwaj
అనసూయ : టాలీవుడ్ లో మోస్ట్ గ్లామర్ ఇమేజ్ ఉన్న యాంకర్ అనసూయ. అనసూయ జబర్దస్త్ షోకి యాంకర్ గా చేసింది. కానీ మధ్యలోనే ఆ షోని వదిలేసింది. అనసూయ ఈ షోని వదిలేయడానికి అనేక కారణాలు వినిపించాయి. తనపై వేసే వల్గర్ పంచ్ లు, డబుల్ మీనింగ్ డైలాగులతో ఆమె విసిగిపోయింది అందుకే షోకి గుడ్ బై చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే అనసూయ సినిమా ఆఫర్స్ కోసం జబర్దస్త్ ని వదిలేసినట్లు కూడా ప్రచారం జరిగింది.
67
Anchor Ravi
యాంకర్ రవి : టాలీవుడ్ లో వివాదాస్పద యాంకర్స్ లో యాంకర్ రవి ఒకరు. రవి చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. రవి చాలా టీవీ షోలకు మధ్యలోనే రాంరాం చెప్పాడు. బిగ్ బాస్ ఆఫర్ కోసం హ్యాపీ డేస్ షోని వదిలేశాడు. పటాస్, ఢీ ఛాంపియన్స్ షో లకి కూడా రవి గుడ్ బై చెప్పాడు. ఢీ ఛాంపియన్స్ కి రవి దూరమయ్యాక ఆ ఛాన్స్ హైపర్ ఆదికి దక్కింది.
77
Varshini
వర్షిణి సౌందరాజన్ : టాలీవుడ్ గ్లామరస్ యాంకర్స్ లో వర్షిణి ఒకరు. వర్షిణి కామెడీ స్టార్స్ షోని మధ్యలోనే వదిలేసింది. బిగ్ బాస్ ఆఫర్ తో పాటు, సినిమాలపై ఫోకస్ చేసేందుకు వర్షిణి ఇలా చేసింది అని ప్రచారం జరిగింది. కానీ ఆమె బిగ్ బాస్ లో పాల్గొనలేదు, సినిమాల్లో కూడా పెద్దగా రాణించలేదు.