Tamannaah Reveals Her Love for Jewelry Design
తమన్నా తెలుగమ్మాయి కాదు అంటే దాన్ని ఎవరూ నమ్మరు. ఎందుకంటే తెలుగు అంత చక్కగా మాట్లాడుతుంది. తన డబ్బింగ్ కూడా తనే తెలుగులో చెప్పుకుంటుంది. ఇక మిల్కీబ్యూటీగా పేరుతెచ్చుకున్న తమన్నా.. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వరుసబెట్టి సినిమా ఆఫర్లను సంపాదించుకుంది. కానీ రీసెంట్‌గా పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. కానీ అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ చేస్తూ కనువిందు చేస్తోంది.
Tamannaah Reveals Her Love for Jewelry Design
చాలా గ్యాప్ తర్వాత తమన్నా ప్రధాన పాత్ర పోషించిన ఓదెల 2 చిత్రం ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదలైంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ నేపథ్యం అంతేకాకుండా గతంలో హిట్టైన ఓదెల రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్ కావడంతో అందరి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కానీ థియేటర్లలోకి వచ్చాక ఓదెల 2కు నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది. దీంతో ఈ ఎఫెక్టు కలెక్షన్లపై పడింది.
Tamannaah Reveals Her Love for Jewelry Design
తమన్నా ఓదెల చిత్రంలో నాగసాధు భైరవిగా నటించింది. కథ, స్క్రీన్‍ప్లే సంపత్ నంది, అశోక్ తేజ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు తమన్నా ఆకర్షణ కాగా..మూవీ టీం గట్టిగానే ప్రమోషన్స్ చేసింది. కానీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సినిమా కథ విషయానికి వస్తే.. ఓదెల అనే గ్రామంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో వీటిని ఎలాగైనా ఆపాలని తమన్నా వద్ద కొన్ని శక్తులు ఉన్నాయని తెలుసుకుని గ్రామస్థులు ఆమె వద్దకు వస్తారు.. ఆ తర్వాత ఆ దుష్టశక్తులతో తమన్నా ఎలా పైచేయి సాధించింది అన్న నేపథ్యంలో కథ తిరుగుతుంది.
Tamannaah Reveals Her Love for Jewelry Design
ఇక సినిమా సంగతి పక్కన పెడితే.. తమన్నా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గాయి కదా.. ఖాళీ సమయాల్లో ఏం చేస్తున్నారు అని యాంకర్ తమన్నాని అడగ్గా.. తాను ఖాళీ సమయాల్లో జ్యూయలరీ మేకింగ్, డిజైనింగ్ చేస్తుంటానని చెప్పింది. నగలు తయారు చేయడం, డిజైనింగ్ అన్నా, మేకింగ్ అన్నా తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. ఏ మాత్రం ఖాళీ దొరికినా వెంటనే ఆ పనిమీదే ఉంటానని అంటోంది మిల్కీబ్యూటీ.
Tamannaah Reveals Her Love for Jewelry Design
తమన్నా తన ఒంటిపై ధరించే 90 శాతం వరకు జ్యూయలరీ... మొత్తం అంతా తను ఓన్‌గా డిజైన్ చేసుకున్నదేనట. కేవలం గోల్డ్ ఆర్నమెంట్స్ మాత్రమే మేకింగ్, డిజైనింగ్ చేస్తుందట. గోల్డ్ కాకుండా ఇంకే తనకు నచ్చదట. అయితే.. దీన్ని మీరు వ్యాపారంగా మార్చుకుంటారా అని యాంకర్ ప్రశ్నవేయగా... ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని.. తన సొంతానికి తాను ఇష్టంతో జ్యూయలరీ మేకింగ్ చేసుకుంటుందని చెబుతోంది. ఏమో గుర్రం ఎగురావచ్చు అన్నట్లు.. భవిష్యత్తులో తమన్నా జ్యూయలరీ బిజినెస్ ప్రారంభించినా ఆర్చర్యపడాల్సిన అవసరం లేదు.