renu desai
Renu desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆయనతో విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగానే ఉంటుంది. దాదాపు 13ఏళ్ల క్రితమే వీరిద్దరు విడిపోయిన విషయం తెలిసిందే. పవన్, రేణు దేశాయ్ విడిపోయే నాటికి వీరికి అకీరా నందన్, ఆధ్య జన్మించారు. విడాకుల తర్వాత పవన్ మూడో పెళ్లి చేసుకోగా, రేణు దేశాయ్ మాత్రం ఒంటరిగానే ఉండిపోయింది. రెండో పెళ్లి చేసుకోలేదు. అయితే అందుకు కొంత సమయం ఉందని చెప్పింది.
renu desai
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. `బద్రి` సినిమా సమయంలో వీరి మధ్య ప్రేమ పుట్టింది. కొంత కాలం సహజీవనం చేశారు. ఆ సమయంలోనే అకీరా నందన్ జన్మించారు. 2004 లో అకీరా జన్మించగా, 2009లో పవన్, రేణు మ్యారేజ్ చేసుకున్నారు. అప్పటికీ అకీరా ఏజ్ ఐదేళ్లు. ఆ తర్వాత ఏడాదికి ఆధ్య జన్మించింది. ఆధ్య జన్మించిన రెండేళ్లకే విడిపోయారు.
Renu Desai
ఇదిలా ఉంటే తన కొడుకు ముందే తన పెళ్లి జరగడం గురించి రేణు దేశాయ్ ఓపెన్ అయ్యింది. అది బాధగా ఉందా? ఇబ్బంది పడ్డారా? ఆ సమయంలో మీ ఫీలింగ్ ఏంటని ప్రశ్నించగా, ఆసక్తికర సమాధానం చెప్పింది రేణు దేశాయ్. అది గొప్ప ఫీలింగ్ అని చెప్పింది. కొడుకు సాక్షిగా తన పెళ్లి జరగడం ఒక థ్రిల్ ఫీలింగ్ అని చెప్పింది.
renu desai, pawan kalyan
అయితే చాలా మంది దీన్ని నెగటివ్‌గా చూశారు, బ్యాడ్‌గా మాట్లాడుకున్నారు. కానీ నాకు మాత్రం అదొక మంచి అనుభూతిగా ఇచ్చిందని, `నా పెళ్లిని నా కొడుకు దగ్గరుండి జరిపించడం అంతకంటే గొప్ప విషయం ఏముంటుంది, ఎందరికి ఈ అవకాశం దక్కుతుంది.
నా కొడుకు ముందు నా పెళ్లి జరిగే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది` అని రేణు దేశాయ్ వెల్లడించింది. తన పెళ్లి అతికొద్ది మంది బంధుమిత్రుల సమయంలో అచ్చతెలుగు సాంప్రదాయం ప్రకారం జరిగిందని చెప్పింది రేణు దేశాయ్.