ఈ కొత్త షెడ్యూల్ గురించి మైండ్ బ్లోయింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సన్నివేశంలో నీటిలో సాగే యాక్షన్ సీన్ అని తెలుస్తోంది. ఈ సీన్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ తో పాటు 3 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటారట. వందలాది బోట్స్ లో 3 వేల మందితో మహేష్ బాబు పోరాటం చేస్తాడని అంటున్నారు. ఊహించుకుంటుంటేనే ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. ఈ సీన్ ని రాజమౌళి ఎలా చిత్రీకరిస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ ఎంట్రీ సీన్ కోసం వేలమంది జూనియర్ ఆర్టిస్టులు వర్క్ చేశారు. ఆ సన్నివేశంలో రాంచరణ్ పెర్ఫార్మెన్స్ కి ప్రశంసలు దక్కాయి. అంతకి మించేలా మహేష్ బాబు పోరాటం 3 వేలమందితో ఉండబోతోందా అనే అంచనాలు ఆల్రెడీ మొదలయ్యాయి.