Tamannaah Birthday: హ్యాపీ బర్త్ డే మిల్క్ బ్యూటీ తమన్నా

First Published | Dec 21, 2021, 11:19 AM IST

టాలీవుడ్ లో లాంగ్ టైమ్ హీరోయిన్ గా కెరీర్ ను నెట్టుకొచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో సీనియర్ హీరోయిన్,మిల్క్ బ్యూటీ తమన్నా(Tamannaah) కూడా ఒకరు. ఎప్పటికప్పుడు కెరీర్ కు తగ్గట్టు తనను మార్చుకుంటూ.. టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసుకున్న తమన్నా పుట్టిన రోజు నేడు.

Tamanah

అందం, అభినయం కలగలసిన హీరోయిన్లు చాలా అరుదు. అటువంటి వారిలో ముందు వరసలో ఉన్న హీరోయిన్లలలో తమన్నా(Tamannaah)  ఒకరు. ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా.. ఆ పాత్రకు తగ్గట్టు.. తనను తాను మలుచుకోవడంలో తమన్నా స్టైలే వేరు.  తన పెర్ఫామెన్స్ తో పాటు బ్యూటీతో మిల్క్ బ్యూటీగా టాలీవుడ్ లో పేరు పేరుతెచ్చుకుంది.. అందాల అభినయ, మిల్కీ బ్యూటీ..తమన్నా.

Tamanah

1989 డిసెంబర్ 21 న మహారాష్ట్ర లో సింది ఫ్యామిలీలో జన్మించింది Tamannaah. తన చిన్నతనం అంతా ముంబై లో గడిపింది. తన పేరెంట్స్ సపోర్ట్ తో చాలా చిన్న వయస్సులోనే మోడలింగ్ వైపు వచ్చిన తమన్నా... 2005 లో ఫిల్మ్ ఇ డస్ట్రీ వైపు అడుగులు వేసింది. మొదటగా హిందీలో చాంద్ స రోషన్ చేహ్రా అనే సినిమాలో నటించింద తమన్నా. కాని అది హిట్ అవ్వలేదు. ఈ సినిమాతో  అనుకున్న పేరు రాలేదు.. దాంతో సౌత్ ప్లైట్ ఎక్కిన తమన్నా..  తెలుగు లో మంచు మనోజ్ సరసన శ్రీ అనే సినిమా చేసింది.. అయినా గుర్తింపు రాలేదు.


శేఖర్ కమ్ముల(Shekar kammula) హ్యాపీ డేస్ సినిమా తమన్నా(Tamannaah) కు బ్రేక్ ఇచ్చింది. ఒక్కసారి గా ఆమెను  లైం లైట్ లోకి తీసుకువచ్చింది. వెంటనే ఆమె  గీత ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ తో  3 సినిమాల డీల్ కుదుర్చుకున్నారు.. అందులో 100 % లవ్, రచ్చ , బద్రీనాథ్ ఆమె కి మరో మెయిలు రాయి.. ఆమె డాన్సుకి అందానికి అభినయానికి మంచి పేరు తెచ్చి పెట్టాయి. తమన్నాకు  మిల్క్ బ్యూటీ అనే ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి ఈ సినిమాలు.

2008లో తమన్నా(Tamannaah)  నటించిన ‘కాళిదాసు’ సినిమాతో తమన్నా నటనకు మంచి మార్కులు పడ్డాయి. కాని ఆ సనిమా అంతగా హిట్ అవ్వలేదు. సిద్ధార్థ్‌ సరసన నటించిన ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ ఫర్వాలేదనిపించింది. సూర్య(Surya)తో చేసిన ‘వీడొక్కడే’ సినిమా సక్సెస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన తమన్నా.. తమిళ్ లో కూడా లైన్ లో పడ్డారు. కార్తీ(Karthi)తో తో నటించిన  ఆవారా, సినిమా తమిళ్ లో తమన్నాకు స్టార్ ఇమేజ్ ఇచ్చింది.

ఇక తెలుగులో వరుసగా జయాపజయాలతో సంబంధం లేకుండా ‘ఊసరవెల్లి’, ‘రచ్చ’, ‘ఎందుకంటే.. ప్రేమంట’, ‘రెబల్‌’, ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’, ‘తడాఖా’,ఊపిరి సినిమాలు తమన్న ను టాలీవుడ్ ఆడియన్స్ కు ఇంకా దగ్గర చేశాయి.

tamannaah

2015లో తమన్నా హీరోయిన్ గా కీలక పాత్రలో నటించిన ‘బాహుబలి: ది బిగినింగ్‌’ (Bahubali)  సినిమా ఆమె కెరీర్ లోనే బెస్ట్గా  నిలిచింది. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి(Rajamouli) దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం తమన్నాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ‘అవంతిక’ పాత్రలో తమన్న నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు.

తమన్నా(Tamannaah)  హీరోయిన్ గా మాత్రమే కాదు ఐటెం సాంగ్స్ లో కూడా నటించి మెప్పించింది. అందులో భాగంగానే అల్లుడు శీను, జై లవ కుశ,స్పీడున్నోడు, సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu)తో సరిలేరు నీకెవ్వరు ససినిమాలో ఐటమ్ సాంగ్స్ చేసింద. తమన్నా మంచి నటి మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా. ఆమె చేసిన ఐటమ్ సాంగ్సే దానిక బెస్ట్ ఎక్జాంపుల్

హీరోయిన్ గా కెరీర్ అయిపోతుంది.. స్టార్ హీరోలతో అవకాశాలు తగ్గిపోతున్నాయి అనుకున్న టైమ్ లో తమన్నారూట్ చేంజ్ చేసుకుంది. విమెన్ సెంట్రిక్ మూవీస్ వైపు.. స్పెషల్ క్యారెక్టర్స్ వైపు చూసింది. అటు బుల్లితెరపై కూడా సందడి చేసింది తమన్నా. ఓటీటీ వైపు అడుగులు వేసింది. లెవెన్త్ అవర్, నవంబర్ స్టోరీస్ లాంటి సక్సెస్ ఫుల్ వెబ్ సీరీస్ లలో నటించిన తమన్నా.. మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ తో హోస్ట్ గా కూడా మారింది.

సైరా లాంటి హిస్టారికల్ మూవీలో మెగాస్టార్(Megastar) తో సందడి చేసిన తమన్న ఈ కరోనా స్ట్రెచ్ లో గోపీచంద్ సరసన సంపత్ నందీ డైరెక్షన్ లో సీటీమార్ సినిమా చేసింది.నితిన్ మాస్ట్రోలో కూడా మంచి పాత్రలో నటంచిన తమన్నా.. ప్రస్తుతం సత్యదేవ్ కాంబినేషన్ లో నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఎఫ్3లో వెంకటేష(Venkatesh) తో కలిసి మరోసారి సందడి చేయబోతున్న తమన్నా.. సైరా తరువాత మరోసారి భోళాశంకర్ లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించబోతోంది.

Latest Videos

click me!