వైరల్ ఫొటోలు: తమన్నా యోగాసనాలు
First Published | Jul 24, 2020, 10:32 AM ISTనిత్యం సినిమాల షూటింగ్ తో బిజీబిజీగా ఉండే మిల్కీ బ్యూటీ తమన్నాకు కరోనా తో కాస్తంత ఖాళీ సమయం దొరికింది. బిజీ షెడ్యూల్ కు దూరంగా ఉన్న తమన్నా వర్కవుట్స్, యోగాతో బిజీ అయ్యింది. తనను తాను ఫిట్ గా తయారు చేసుకునేందుకు ఈ ఖాళీ సమయాన్ని ఆమె వినియోగించుకుంటోంది. గత మూడు నెలలుగా ఆమె సెలవులే. ఇంట్లో తినాలి.. వర్కౌట్స్ చేయాలి అనే పాలసితో ముందుకు వెళ్తోంది. ఎలాగో పనిలో పనిగా... కుటుంబంతో హాయిగా గడపోతోంది. అంతేకాదు పనిలో పనిగా తాను చేసిన ఫన్నీ వీడియోలు, డాన్సు, వ్యాయామం, యోగాకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఆ ఫొటోలను మీరూ చూడండి...ప్రేరణ పొందండి.యోగా మొదలెట్టండి అంటూ నినాదాలు ఇస్తోంది. ఫ్యాన్స్ కూడా అలాగే అంటూ తమ ఫొటోలను కూడా క్రింద కామెంట్స్ తో షేర్ చేస్తున్నారు. తమన్నా ఫొటోలను మీరు ఇక్కడ చూడవచ్చు.