
ముద్దు సీన్ చేయటానికి కూడా ఇష్టపడని తమన్నా కూడా మొత్తానికి కూడా హద్దులు దాటేసింది.రీసెంట్ గా లవ్ మేకింగ్ సీన్స్ తో కూడిన హాట్ హాట్ వెబ్ సీరిస్ చేసింది. అరుణిమా శర్మ, హోమీ అదజనియా తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ ‘జీ కర్దా‘లో ఆమె కీ రోల్ చేసింది.ఈ సీరిస్ మొన్నటి నుంచే స్ట్రీమ్ అవుతోంది. ఈ వెబ్ సీరిస్ ఎలా ఉంది అనేదాని కన్నా .....ఎలా ఉండబోతోందనే చర్చే ఎక్కవ ఆసక్తిగా ఉందంటున్నారు.అందుకు కారణం తమన్నా హాట్ షోనే అనేది నిజం. ఈ క్రమంలో అనేక విమర్శలు వచ్చాయి. వాటికి తమన్నా సమాధానం చెప్పింది
మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన ఈ కొత్త వెబ్ సిరీస్ జీ కర్దా నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి నుంచి ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఆదిపురుష్ రిలీజ్ ని దృష్టిలో పెట్టుకుని శుక్రవారానికి బదులు గురువారమే ఈ రామ్ కామ్ సిరీస్ ని విడుదల చేశారు. ఆ సీరిస్ కు మంచి రెస్పాన్సే వచ్చింది.
ఎవరు ఒప్పుకున్నా కాదన్నా, ఒప్పుకోకపోయినా .. ఈ సీరిస్ మీద ప్రేక్షకులకు ప్రత్యేక ఆసక్తి కలగడానికి కారణం తమన్నా బోల్డ్ షోనే. ట్రైలర్ లో ఓ సీన్ చూసి ఆడియన్స్ చాలానే ఊహించుకున్నారు. దానికి తగ్గట్టే ఒక పడకగది సీన్లో దాదాపు టాప్ లెస్ గా నటించిన తమ్మూని చూసి అభిమానులు సైతం షాకవుతున్నారు
ఈ వెబ్ సీరిస్ కథ విషయానికి వస్తే పాఠశాల దశ నుంచే స్నేహితులుగా ఉన్న లావణ్య(తమన్నా), రిషబ్(సుహైల్)లు లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటారు. ఓ వేడుక సందర్భంలో రిషి ఆమెకు పెళ్లి ప్రతిపాదన తీసుకొస్తాడు. అక్కడ నుంచి వచ్చే ట్విస్టులతో మిగతా కథ నడుస్తుంది.
వాస్తవానికి ఈ సీరిస్ ఒక జంట కథ కాదు. తమన్నా కథ కాదు. లైఫ్ పార్ట్ నర్ కోసం వెతుకుతున్న ప్రీత్(అన్యసింగ్), మధ్యతరగతి ఇరుకు ఇంట్లో భర్తతో కనీస సుఖం లేదని బాధ పడే శీతల్(సంవేదన), ఆర్థిక సమస్యలతో బాధ పడుతున్న టైంలో పెళ్ళైన మహిళను ప్రేమించే షాహిద్(హుస్సేన్), బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్ ని బయట పెట్టుకోలేని మెల్రాయ్(నయాన్) ఇలా లావణ్య స్కూల్ మేట్స్ అయినా వీళ్లందరి జీవితాల సమూహారం జీకర్దా.
ఈ సీరిస్ పై వస్తున్న విమర్శలుపై తమన్నా ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడింది. "కథకు ఇలాంటి సీన్స్ ఖచ్చితంగా అవసరం అనిపించాయి. ఒక రిలేషన్షిప్ ని వాస్తవంగా చూపించడంలో ఇలాంటి సీన్స్ చాలా కీలకంగా ఉంటాయి. అందుకే అలాంటి సీన్స్ చేయాల్సి వచ్చింది. ఎవరు విమర్శలు చేసినా, అది జనాలకు నచ్చినా? నచ్చకపోయినా కథలో భాగంగా వాటిని అలాగే చూపిస్తారు. ఓ ఇద్దరు వ్యక్తులు తమ జీవితంలో ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకునే క్రమంలోనే ఆ సన్నివేశాలు వస్తాయి. అని చెప్పుకొచ్చింది.
ఇక మా డైరెక్టర్ అరుణిమ ఇచ్చిన సూచనలు అలాంటి సన్నివేశాల్లో సులభంగా, సౌకర్యవంతంగా నటించేందుకు ఉపయోగపడ్డాయి" అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. తమన్నా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. కాగా త్వరలోనే 'లస్ట్ స్టోరీస్ 2' అనే మరో బోల్డ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందు రాబోతుంది తమన్నా.
ఇక ఈ సీరిస్ లో ..దినేష్ విజయన్ నిర్మించిన ఈ సిరీస్ లో తమన్నా, సుహైల్ నయ్యర్, ఆశీమ్ గులాటీ, అన్యా సింగ్, సయాన్ బెనర్జీ, సంవేదన, మల్హర్ టక్కర్, హుస్సేన్ దలాల్, అక్షయ్ బింద్రా, కిరా నారాయణన్, సిమోన్ సింగ్ తదితరులు నటించారు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైంది. ఇందులో తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించింది.
ఈ సిరీస్ లో తమన్నా బోల్డ్ సీన్స్ చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా బోల్డ్ సీన్లలో రచ్చ చేసింది. ఆమె బోల్డ్ అవతార్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ‘జీ కర్దా’ వెస్ సిరీస్ లోని తమన్నా సీన్లు ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికీ జోరుగానే సినిమాలు చేస్తూ వస్తోంది మిల్క్ బ్యూటీ తమన్నా.. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళంలోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లోనటిస్తోంది. తెలుగులో చివరిగా ‘ఎఫ్3’,‘గని’తో అలరించింది. హిందీలో ‘బబ్లీ బౌన్సర్’,‘ప్లాన్ ఏ ప్లాన్ బీ’తో ఆకట్టుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ‘భోళా శంకర్’ (Bhola Shankar)లో ఆడిపాడుతోంది.
ఇక తమన్నా గ్లామర్ షోకి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వెబ్ సిరీస్ నేటి తరానికి చెందిన యువతీ యువకుల అనుభవాలకు ప్రతిబింబిస్తుందని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో తమన్నా తెలిపింది. ఆమె చెప్పినట్లుగానే, తమన్నా బోల్డ్ అవతార్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannah Bhatia) కేరీర్ ప్రస్తుతం జోరుగానే కొనసాగుతోంది. సౌత్, నార్త్ సినిమాల్లో నటిస్తూ బ్యాక్ టు బ్యాక్ తన అభిమానులు, ఆడియెన్స్ ను అలరిస్తూ వస్తోంది. ఇప్పటికీ కేరీర్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటూ ట్రెండింగ్ లో ఉంటోంది.
వెబ్ సిరీస్ జీ కర్దా( Jee karda web series లో కొన్ని సన్నివేశాల్లో బోల్డ్ గా నటించింది.ఆ సన్నివేశాల యొక్క స్క్రీన్ షాట్స్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్న విషయం తెల్సిందే.
చాలా మంది హీరోయిన్లు ఓటీటీ సిరీస్ లలో బాగా బోల్డ్ సీన్లు చేస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి మిల్కీ బ్యూటీ కూడా ఎంటర్ అయ్యింది. తనకు ఈ కథ, ఇందులోని తన పాత్ర చాలా బాగా నచ్చిందని గతంలోనే తమన్నా చెప్పింది.