ఫారెన్‌ వ్యక్తి లవ్‌ యాక్సెప్ట్ చేసిన రష్మి గౌతమ్‌.. సడెన్‌గా ఇలాంటి ట్విస్ట్ ఇవ్వడంతో షాక్‌లో ఫ్యాన్స్..

Published : Jan 02, 2024, 04:19 PM ISTUpdated : Jan 02, 2024, 05:55 PM IST

`జబర్దస్త్ రష్మి.. ఇటీవల పెళ్లి పార్టీలో మ్యారేజ్‌ విషయం చెబుతానని తుస్సుమనిపించింది. కానీ ఇప్పుడు ఆమె కోసం ఫారెన్‌ నుంచి కుర్రాడు రావడం ఆశ్చర్యపరుస్తుంది.   

PREV
17
ఫారెన్‌ వ్యక్తి లవ్‌ యాక్సెప్ట్ చేసిన రష్మి గౌతమ్‌.. సడెన్‌గా ఇలాంటి ట్విస్ట్ ఇవ్వడంతో షాక్‌లో ఫ్యాన్స్..
photo credit- mallemala

రష్మి గౌతమ్‌.. నాలుగు పదులకు దగ్గరలో ఉంది. ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి మ్యాటర్‌ని ఊరిస్తుంది. ఇటీవల `రష్మి పెళ్లి పార్టీ` అంటూ హంగామా చేసింది. తీరా తుస్సుమనిపించింది. ఎప్పటిలాగే కామెడీ చేసి వదిలేశారు. కానీ అంతలోనే పెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చింది రష్మి. ఇంకా చెప్పాలంటే ఆమెకి షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్‌ పడింది. 

27
photo credit- mallemala

యాంకర్‌ రష్మి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో అనేది చాలా మంది అభిమానుల్లో నిలిచిపోయిన ప్రశ్న. కానీ ఆమె ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కనిపించడం లేదు. అయితే ఆమెని ఇష్టపడే వాళ్లు లక్ష్లల్లో ఉన్నారు. పదేళ్లుగా రష్మి యాంకర్‌గా రాణిస్తున్న నేపథ్యంలో ఆమెకి ఎంతో మంది అభిమానులు అయ్యారు. ఆమెని అమితంగా ఇష్టపడుతున్నారు. 
 

37
photo credit- mallemala

కానీ విదేశాల నుంచి రష్మి కోసం రావడం విశేషం. ఆమె యాంకర్‌గా చేస్తున్న `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోలో కొందరు ఫారెనర్స్ సందడి చేశారు. ఇందులో తమ మనసులో మాట వెల్లడించారు. ఒక ఫారెనర్‌.. తనకు అందరు అమ్మాయిలు నచ్చారని చెప్పగా, ఒక వ్యక్తి మాత్రం రష్మిపై మనసు పడ్డాడు.  తనకు మాత్రం రష్మి నచ్చిందని చెప్పాడు. 
 

47
photo credit- mallemala

తన పేరు చెప్పడంతో యాంకర్‌ రష్మి షాక్‌ అయ్యింది. తాను నచ్చనని చెప్పడంతో ఆమె నోరెళ్ల బెట్టింది. అంతటితో ఆ ఫారెనర్‌ ఆగలేదు. స్టేజ్‌పైకి వచ్చాడు. గులాబీ పువ్వు తీసుకుని వచ్చాడు. అది చూసి రష్మి సిగ్గులొలికించగా.. అతను ఆమెకి రోజా పువ్వు ఇస్తూ లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తెలుగులో ప్రేమని వ్యక్తం చేశాడు. 
 

57
photo credit- mallemala

దీనికి రష్మి కూడా హ్యాపీగా రియాక్ట్ అయ్యింది. అతని ప్రేమకి ఫిదా అయిపోయింది. హో.. అంటూ అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. అతను ఇచ్చిన రోజా పువ్వుని తీసుకుని థ్యాంక్యూ చెప్పింది. కానీ ఐ లవ్యూ చెప్పిందా అనేది సస్పెన్స్.  

67
photo credit- mallemala

 అయితే ఈ సందర్బంగా నిర్వహకులు `ఫీల్ మై లవ్‌ `అంటూ పాటని వేస్తూ మరింతగా పులిహోర కలిపారు. ఇది `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోకి సంబంధించిన ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది. ఇది జనవరి 7న ప్రసారం కానుంది. 

77

`జబర్దస్త్` లో కమేడియన్‌ సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆమె చేసే రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ తారాస్థాయికి చేరుతుంది. రష్మినే టార్గెట్‌గా సుధీర్‌ పంచ్‌లు, డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లు పేలుస్తూ అలరించారు. అంతేకాదు ఇద్దరు చాలా సందర్భాల్లో కలిసి డ్యూయెట్లు పాడుకున్నారు. ఒకరంటే ఒకరికి ఉన్న ప్రేమని చాటుకున్నారు. స్టేజ్‌పై పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories