Tamannaah New House: తమన్నా కొత్తింటి ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌.. కేవలం ఇంటీరియర్‌కే 3 కోట్లు

Published : Jun 17, 2026, 10:27 AM IST

Tamannaah New House: నటి తమన్నా భాటియాకు ముంబైలో సముద్రానికి ఎదురుగా ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్ ఉంది. దాని ఇంటీరియర్ ఎలా ఉంటుంది? దాని ప్రత్యేకతలు ఏంటి? ఆ ఇంటి ఫోటోలు ఇక్కడ ఉన్నాయి.  

PREV
15
టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన తమన్నా

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఓ ఊపు ఊపిన తమన్నా ఇప్పుడు బాలీవుడ్‌కే పరిమితమయ్యింది. తెలుగులో సినిమాలు తగ్గించింది. ఆమెకి ఆఫర్లు రావడం లేదా? లేక ఆమె చేయడం లేదా? కారణం ఏంటోగానీ తమన్నా తెలుగులో సినిమాలు చేయడం లేదు. కానీ సోషల్‌ మీడియా ద్వారా తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు తమన్నా వార్తల్లో నిలిచింది. కొత్తిళ్లు కొన్నది. దీని ధర షాకిస్తోంది. 

25
లగ్జరీ ఇళ్లు కొన్న తమన్నా

 తమన్నా భాటియా ఇటీవలే ముంబాయిలో ఒక అపార్ట్మెంట్‌లో లగ్జరీ ఫ్లాట్‌ కొనుగోలు చేసింది.  ఈ ఇల్లు ఏ 5-స్టార్ హోటల్‌కు తక్కువ కాదు. ఇక్కడ అన్ని లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. తమన్నా ఇల్లు సుమారు 6065 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ అపార్ట్‌మెంట్ ప్రత్యేకత ఏంటంటే, అన్ని వైపుల నుంచి సముద్రం కనిపిస్తుంది. 

35
తమన్నా కొత్తింటి ధర తెలిస్తే ఫ్యూజులు ఔట్‌

మరి ఈ కొత్త ఫ్లాట్‌ ధర ఎంతో తెలిసా, ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. ఈ ఫ్లాట్ వెర్సోవా-జుహు లింక్ రోడ్‌లోని 'బే వ్యూ' అనే 22 అంతస్తుల భవనంలో 14వ అంతస్తులో ఉంది. తమన్నా ఈ ఫ్లాట్‌ ను రూ.16.60 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ ఇంటి ఇంటీరియర్ డిజైన్ కోసమే ఏకేంగా  దాదాపు రూ. 2-3 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు సమాచారం. 

45
తమన్నా ఇంట్లో ఓపెన్ బాల్కనీ

తమన్నా ఇంటి ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ పెద్ద ఓపెన్ బాల్కనీ ఉంది. అందులో రకరకాల మొక్కలు నాటారు, అంతా పచ్చదనంతో నిండి ఉంటుంది. బాల్కనీలో ఐదుగురు కూర్చోగలిగే పెద్ద జకుజీ కూడా ఉంది.

55
తమన్నా ఇంటి ఇంటీరియర్

తమన్నా లివింగ్ రూమ్‌ను తెలుపు, క్రీమ్, నలుపు రంగులతో అలంకరించారు. దీనితో పాటు వెల్వెట్ సోఫాలు, స్టైలిష్ డిజైనర్ కాఫీ టేబుల్, మోడరన్ డెకర్‌ను ఉంచారు. దీంతో ఇది కనువిందుగా ఉంది. అత్యంత లావిష్‌గానూ ఉంది. మొత్తంగా తమన్నా ఈ కొత్తింటిలో లగ్జరీ లైఫ్‌ని లీడ్‌ చేయబోతుందని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories