Tamannaah Bhatia: తమన్నా భాటియా, విజయ్ వర్మ రెండేళ్ల ప్రేమకు బ్రేకప్ చెప్పకున్నట్లు సమాచారం. తమన్నా తన ఇంస్టాగ్రామ్ నుండి విజయ్ వర్మతో ఉన్న ఫోటోలను తొలగించడంతో ఈ వార్త వైరల్ అవుతోంది.
Tamannaah Bhatia and Vijay Verma call it quits after two years of dating in telugu
Tamannaah Bhatia: ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా బ్రేకప్ అని. త్వరలో ఆమె పెళ్లి చేసుకోబోతోందనే వార్త వస్తుందని ఎదురుచూస్తున్న టైమ్ లో ఇది ఊహించని షాకే. గత కొంతకాలంగా బాలీవుడ్ హీరో విజయ్ వర్మ ప్రేమలో తమన్నా ఉన్నారనేది బహిరంగ రహస్యమే.
2023 నుంచి కొనసాగుతున్న తమ లవ్ స్టోరిని ఆ జంట అనేక ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. అంతేకాదు ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లే వారు. ఫంక్షన్లలో జంటగా కనిపించారు. అయితే వీళ్లిద్దరు లవ్ బ్రేకప్ అయ్యిందనే వార్త బయిటకు వచ్చి వైరల్ అవుతోంది. అయితే ఎందుకు బ్రేకప్ అయ్యింది
23
Tamannaah Bhatia and Vijay Verma call it quits after two years of dating in telugu
తాజాగా తమన్నా ఇంస్టాగ్రామ్ వేదికగా తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి ఉన్నటువంటి ఫోటోలు అన్నింటినీ కూడా డిలీట్ చేసారని తెలుస్తోంది. దీనితో ఒక్కసారిగా వీరి రిలేషన్ గురించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి .
తమన్నా విజయ్ వర్మ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారా అందుకే ఈమె తన సోషల్ మీడియాలో తన ప్రియుడుతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేశారా అంటూ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రీసంట్ గా ఓ ఇంటర్వ్యూలో విజయ్ తమన్నా భాటియాతో తన సంబంధాన్ని ప్రకటించాడు. ఒకరినొకరం డేటింగ్ చేసుకుంటున్నాము. నేను సంతోషంగా ఉన్నాను. ఆమెతో పిచ్చిగా ప్రేమలో ఉన్నాను అని తెలిపారు.
33
Tamannaah Bhatia and Vijay Verma call it quits after two years of dating in telugu
మరోవైపు తమన్నా కూడా ఓ ఇంటర్వ్యూలో వివాహం గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను సంతోషంగా ఉన్నాను. త్వరలో వివాహం కూడా జరగవచ్చు అన్నట్లుగా మాట్లాడారు. ఆ మధ్య పలు ఈవెంట్లలో కూడా ఇద్దరు కలిసి కనిపించారు. ఫొటో షూట్లట్లో కూడా పాల్గొన్నారు.
ఇలా కొంతకాలం హ్యాపీ రిలేషన్ షిప్ మెయింటైన్ చేసిన.. అంతలోనే విడిపోవడానికి కారణం ఏంటి అనేది అందరికీ ప్రశ్నే? అయితే తమన్నా కు చెందిన కొన్ని పర్శనల్ విషయాల్లో విజయవర్మ కలగచేసుకున్నారని, అందుకే వీరిద్దరి మధ్యా గొడవలు అయ్యాయని, అదే బ్రేకప్ కి దారి తీసిందని చెప్పుకుంటున్నారు.
అయితే ఎంతవరకూ నిజముందేనేది తెలియాల్సి ఉంది. అయితే, ఈ లవ్ బ్రేకప్ వార్తలపై ఇటు తమన్నా కానీ అటు విజయ్ కానీ స్పందించలేదు. ఇప్పటికే వారాలు గడిచినా తమ బ్రేకప్ విషయంపై వారు ఎక్కడా మాట్లాడలేదు.