Dragon OTT: ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ మూవీ థియేటర్లలో మంచి విజయం సాధించింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.
Pradeep Ranganathan starrer Dragon OTT streaming details in telugu
Dragon OTT: ఈ మధ్య కాలంలో తమిళ డబ్బింగ్ అయ్యి అల్టిమేట్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా మాస్ రచ్చ చేస్తున్న చిత్రం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ (Return Of The Dragon). లవ్ టుడే చిత్రంతో తెలుగువారికి పరిచయమైన ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) నటించిన ఈ చిత్రం రెండో వీక్ వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపిస్తోంది.
ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. దీనికితోడు, అదే సమయంలో విడుదలైన టాలీవుడ్ సినిమా మజాకా (Mazaka) అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేకపోవటం కూడా ట్రేడ్ లో ఆశ్చర్యంగా మారింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి డిటేల్స్ బయిటకు వచ్చాయి.
24
Pradeep Ranganathan starrer Dragon OTT streaming details in telugu
ఫిబ్రవరి 21, 2025న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు దాదాపు రూ.120 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ చెప్తోంది. ఇక ఈ సినిమా ఓటీటీ విడుదల గురించిన సమాచారం విషయానికి వస్తే మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం డ్రాగన్ సినిమా మార్చి 21, 2025న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే అవనుంది. అయితే అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు.
34
Pradeep Ranganathan starrer Dragon OTT streaming details in telugu
అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్ గోట్ మూవీని నిర్మించిన AGS నిర్మించింది. ఈ చిత్రంలో ఆయన సరసన అందాల భామలు అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ ఇద్దరూ హీరోయిన్లుగా నటించారు.
వీరితోపాటు వారితో కె.ఎస్. రవికుమార్, మైష్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కలిసి నటించారు. ఈ సినిమా పూర్తిగా లవ్, రొమాన్స్, యాక్షన్ నేపథ్యంలో సాగుతుంది.
44
Pradeep Ranganathan starrer Dragon OTT streaming details in telugu
నటుడు ప్రదీప్ నటించిన తొలి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం కావడం గమనార్హం. అలాగే ఈ సినిమాలో ప్రదీప్ తన నటనతో ఆకట్టుకున్నాడు. యూత్‌ను టార్గెట్ చేసిన కంటెంట్, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్, ఎమోషనల్ డ్రామా కలిపి డ్రాగన్ సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి.
12 రోజుల్లో టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో 17.11 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా 9.38 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 4.50 కోట్ల టార్గెట్ మీద 4.88 కోట్ల ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.