ప్రేమికులైన తమన్నా, విజయ్ వర్మ పెళ్లి చేసుకుంటున్నారు. కొన్ని మీడియా కథనాల ప్రకారం, వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటించవచ్చు. వచ్చే ఏడాది వీరిద్దరి పెళ్లి జరగవచ్చని ప్రచారం జరుగుతోంది.
కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న ఈ జంట గత రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. తమన్నా, విజయ్ వర్మ కొత్త ఇల్లు వెతుకుతున్నారని పలు కథనాలు వచ్చాయి.
వచ్చే ఏడాది తమన్నా, విజయ్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు, దానికి సన్నాహాలు మొదలుపెట్టారని తెలిసింది.
అయితే తమ ప్రేమ గురించి మౌనంగా ఉన్నట్టే, పెళ్లి గురించి కూడా ఏమీ చెప్పలేదు. మిల్కీ బ్యూటీ అని పిలుచుకునే తమన్నా ఇచ్చిన ఒక స్టేటస్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సినిమా తారలు తమన్నా భాటియా, విజయ్ వర్మ తమ పెళ్లి గురించి సీరియస్‌గా మాట్లాడుకుంటున్నారని ఈ టైమ్స్ కథనం ప్రచురించింది.
2023లో 'లస్ట్ స్టోరీస్ 2' విడుదల సమయంలో తమన్నా భాటియా, విజయ్ వర్మ తమ సంబంధాన్ని ధృవీకరించారు. లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ లో వీళ్లిద్దరి మధ్య ఘాటు రొమాన్స్ జరిగింది.
'లస్ట్ స్టోరీస్ 2' వీరిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా. మా వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతున్నాం అని విజయ్ వర్మ అన్నారు.
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, విజయ్ వర్మ ఇద్దరూ ముంబైలోని పాలి హిల్స్‌లో కొత్త ఇల్లు వెతుకుతున్నారట.వీళ్ళిద్దరూ కలసి నివసించేందుకు లగ్జరీ గా ఉండే ఇంటి కోసం ప్రయత్నిస్తున్నారు.
'సికందర్ కా ముఖందర్' తమన్నా భాటియా తదుపరి చిత్రం. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమా దర్శకుడు నీరజ్ పాండే.