సుకుమార్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏమిటి? ఏ హీరోతో

First Published | Dec 7, 2024, 11:33 AM IST

సుకుమార్ 'పుష్ప 2' తర్వాత ఏం చేయబోతున్నారో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ తో సినిమా ఉండగా, 'సెల్ఫిష్' సినిమాకు కూడా పనిచేయనున్నారు. అంతేకాకుండా, ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలం విరామం తీసుకోనున్నారు.


ప్రముఖ దర్శకుడు సుకుమార్ మరోసారి తనను తాను  ప్రూవ్ చేసుకున్నారు. ఆయన గురించే ఇప్పుడు సినిమా పరిశ్రమ, సినిమా లవర్స్ మాట్లాడుతున్నారు. తనలోని మాస్ యాంగిల్ ని బయిటకు తీసి ఫ్యామిలీ ఎమోషన్స్ ని కలిపి హిట్ కొట్టారు.  ఈ  సినిమాలో ప్రతీ సన్నివేశం, డైలాగ్,  హీరో వ్యక్తిత్వం అన్ని చాలా జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకుని రాసిన రైటింగ్.

 సాధారణంగా సుకుమార్ కథలలో మానవ భావనలు, సంఘటనలు, ఒత్తిళ్ళను సహజంగా అణిచివేయటం,, బలమైన పల్లవికి జీవనదిలోని బలాన్ని రానివ్వడమే అతని ప్రత్యేకతగా ఉంటూ వస్తోంది. సుకుమార్ వర్కింగ్ స్టైల్‌ ఏమిటంటే స్క్రిప్టుని పూర్తిగా ఆలోచనాత్మక పరిశోధనలా చేస్తాడు, కథను పూర్తిగా గమనించడానికి, కొత్తదనంతో చిత్రీకరిస్తూ, టెక్నికల్ విలువలను పరిగణలో తీసుకునేలా మన ముందు ఉంచుతాడు.

Pushpa 2, Sukumar, allu arjun


వాస్తవానికి మూడేళ్ల పాటు.. ‘పుష్ప 2’ కోసం  గ్యాప్ లేకుండా కంటిన్యూగా  క‌ష్ట‌ప‌డ్డాడు సుకుమార్‌.  సినిమా ప్రేమికులు కూడా భాక్సాఫీస్ దానికి త‌గిన ఫ‌లితమే ఇస్తున్నారు. ఈ క్రమంలో  ‘పుష్ప 2’ త‌ర‌వాత సుకుమార్ ఏం హీరోతో చేస్తాడు.? నెక్ట్స్  సినిమా ఎప్పుడు? అనేదే అందరి మనస్సులో ఆలోచన. అయితే సుకుమార్ ఏ హీరోతో సినిమాలు కమిటయ్యాడు అనేది ముందు చూడాలి. 


Pushpa 2, Sukumar, allu arjun


అల్లు అర్జున్ తో  ‘పుష్ప 2’చేసిన త‌ర‌వాత రామ్ చ‌ర‌ణ్‌తో సుకుమార్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ చాలా బిజీగా ఉన్నాడు. గేమ్ ఛేంజర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే బుచ్చిబాబు సనా సినిమాకు పని చేస్తున్నాడు.

ఈ క్రమంలో సుకుమార్ కు రామ్ చరణ్ తో సినిమా చేయటానికి  టైమ్ ఉంది. అలాగే సుకుమార్ ద‌గ్గ‌ర పెరిగిన రామ్ చరణ్ ఇమేజ్ కు తగ్గ  క‌థ కూడా సిద్ధం గాలేదు. బుచ్చిబాబుతో చేస్తున్న సినిమా పూర్త‌య్యేలోగా సుకుమార్ కథ రెడీ చేసుకోవొచ్చు.  అదే ప్లాన్ అంటున్నారు. 
 

Pushpa 2, Sukumar, allu arjun


అయితే సుకుమార్ అంతకాలం ఖాళీగా ఉండాల్సిన పనిలేదు.  దిల్ రాజు బ్యాన‌ర్‌లో సెట్స్‌పైకి వెళ్లిన ‘సెల్ఫిష్‌’కు కొన్ని రిపేర్లు  చేయాలని తెలుస్తోంది. సెల్ఫిష్ సినిమా సెకండాఫ్ లో కొంత ఇబ్బంది ఉంద‌ని, సుకుమార్ కూర్చుని సెట్ చేస్తాడని తెలుస్తోంది.

దిల్ రాజు కూడా ఇదే విష‌యం గ‌తంలో ఓ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు.  ఇవన్నీ కాకుండా సుకుమార్ రైటింగ్స్ లో రెండు సినిమాలు త్వ‌ర‌లో ప‌ట్టాలెక్క‌బోతున్నట్లు సమాచారం. వాటి స్క్రిప్టులు సుకుమార్ ఓకే చేయాలి . 
 

Pushpa 2, Sukumar, allu arjun


ఇవి కెరీర్ కు సంభందించిన విషయాలు. అయితే  పర్శనల్ లైఫ్ కు వస్తే...సుకుమార్ ..పుష్ప హడావిడిలో పడి ఫ్యామిలీకు దూరంగా ఉంటూ వచ్చారు. దాంతో ఫ్యామిలీతో  కొంతకాలం గడపాలి. అలాగే ఆయన గ‌త కొంత‌కాలంగా న‌డుంనొప్పితో బాధ ప‌డుతున్నట్లు సమాచారం.

అమెరికా వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.  కాబట్టి ఫ్యామిలీతో అమెరికా వెళ్లి అక్కడే  కొంత కాలం ఉండి, స్క్రిప్టుపై అక్క‌డే క‌స‌ర‌త్తులు చేస్తార‌ని వినికిడి. ఏదైమైనా 2025లో సుకుమార్ నుంచి కొత్త సినిమాలేం రావు, ప్రారంభం కావు.  
 

Latest Videos

click me!