టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు.
టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు.
29
తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో తమన్నా ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది.
39
సినిమాకు అవసరమైన మేరకు తమన్నా అందంతో మెప్పిస్తూనే వచ్చింది. రచ్చ లాంటి చిత్రాల్లో తమన్నా తన గ్లామర్ తో కుర్రాళ్ల కలల రాణిలా మారిపోయింది.
49
తమన్నా టాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్సుల్లో ఫోటో షూట్స్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ లో నెటిజన్లని సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది.
59
ప్రస్తుతం తమన్నా ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. నాని ఎంసీఏ చిత్రంలో విలన్ గా నటించిన హిందీ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు బయటపడింది. విజయ్ వర్మతో లవ్ లో ఉన్నట్లు తమన్నా ఓపెన్ గానే చెప్పింది.
69
ఈ జంట రీసెంట్ గా మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. తమన్నా మాల్దీవుల నుంచి షేర్ చేసిన పిక్స్ ఇంటర్నెట్ లో దుమారం రేపాయి. అంతే కాదు తన ప్రియుడు విజయ్ వర్మతో తమన్నా కలసి ఎంజాయ్ చేసింది. కానీ తన ప్రియుడికి సంబంధించిన పిక్స్ మాత్రం రివీల్ చేయలేదు.
79
తాజాగా వీరిద్దరూ మాల్దీవుల వెకేషన్ ముగించుకుని ఎయిర్ పోర్ట్ లో మెరిశారు. ఇద్దరూ విడివిడిగా ఎయిర్ పోర్ట్ నుంచి బయటకి వెళ్లారు. దీనితో మీడియా అభిమానులు తమన్నా, విజయ్ వెంట పడ్డారు.
89
తమన్నా మెరూన్ కలర్ బ్రా లాంటి టాప్ లో అందాలు వెదజల్లుతూ మెరిసింది. మాల్దీవుల వెకేషన్ ఎలా ముగిసింది ? విజయ్ సర్ రాలేదా అని తమన్నాని ప్రశ్నించారు. దీనితో తమన్నా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది.
99
ఇక విజయ్ వర్మ రాగానే ఆయనకి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. మాల్దీవుల్లో బాగా మజా చేశారా అంటూ ఎయిర్ పోర్ట్ లో ఓ అభిమాని అడిగారు. దీనితో విజయ్ వర్మ ఆగ్రహంతో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు.. మీరు ఇలా మాట్లాడకూడదు అంటూ వెళ్లిపోయారు.