Brahmamudi: రాజ్ కి చివాట్లు పెట్టిన సీతారామయ్య.. తప్పు చేసి తలొంచుకున్న కళ్యాణ్!

Published : Sep 01, 2023, 09:36 AM IST

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 1 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
18
Brahmamudi: రాజ్ కి చివాట్లు పెట్టిన సీతారామయ్య.. తప్పు చేసి తలొంచుకున్న కళ్యాణ్!

ఎపిసోడ్ ప్రారంభంలో కాఫీ షాప్ దగ్గరికి వస్తాడు కళ్యాణ్. అతనికి స్టాఫ్ ఒకతను ఎదురొచ్చి మీకు అనామిక మేడం గ్రాండ్ వెల్కమ్ చెప్పమన్నారు అని చెప్తాడు. సరే అని చెప్పి లోపలికి వెళ్లేసరికి లోపల మరో స్టాఫ్ ఎదురొచ్చి టేబుల్ నెంబర్ చెప్పి అనామిక మేడం అక్కడ కూర్చోమన్నారు అని చెప్తాడు. అలాగే అని కూర్చుంటాడు కళ్యాణ్. అక్కడికి ఒక అమ్మాయి రెడ్ రోజ్ తీసుకొని వచ్చి  మీ కవితలు చాలా బాగుంటాయి అని చెప్తుంది. మీరు మళ్ళీ నన్ను మోసం చేయాలనుకోవద్దు. నాకు అనామిక వాయిస్ తెలుసు మీరు అనామిక కాదు అంటాడు కళ్యాణ్.

28

 నేను అనామిక అని ఎవరు చెప్పారు? అనామిక మేడం వస్తున్నారు కూర్చొండి అని చెప్పి ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. అలా ముగ్గురు ఆడవాళ్ళు అతను దగ్గరికి వచ్చి ఫ్లవర్స్ ఇచ్చి అనామిక మేడం వస్తుంది వెయిట్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతారు. మరోవైపు రాజ్ ని తన దగ్గరికి పిలిపించుకుంటాడు సీతారామయ్య. ఇది అందరి ముందు మాట్లాడే విషయం కాదు అందుకే  రమ్మన్నాను..కావ్య గురించి నీతో మాట్లాడాలి.
 

38

 నీ సంసారం గురించి నాకు, మీ నానమ్మకి భయంగా ఉంది. కావ్య ఇప్పటివరకు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. అందరికీ మంచిగా కనిపిస్తున్నది.. నీకు మీ అమ్మకి మాత్రం చెడుగా కనిపిస్తున్నది. నీ వెనక ఉన్న ఆస్తిని కొంచెం కూడా ఆశించకుండా తన తల్లిదండ్రులకు సాయం చేస్తుంది అలాంటి వ్యక్తిత్వం ఉన్న భార్య మనసుని నువ్వు అర్థం చేసుకొని మెలగాలి. నేను మీ నానమ్మ అలాగే ఇన్నాళ్లు కలిసిమెలిసి ఉన్నాము అని మనవడికి క్లాస్ తీసుకుంటాడు సీతారామయ్య.
 

48

మరోవైపు కళ్యాణ్ దగ్గరికి అనామిక వస్తుంది. ఆమెను చూసి ఫ్రీజ్ అయిపోతాడు కళ్యాణ్. ఇన్నాళ్లు కనబడాలని అనుకున్నారు తీరా కనిపించేసరికి అలా అయిపోతారేం? అయినా నేనే అనామిక అని ఎలా గుర్తుపట్టారు అంటుంది. కవిని కదా ఆ మాత్రం గుర్తుపట్టకపోతే ఎలా అని చెప్పి ఆమెకి ఒక వాచి గిఫ్ట్ గా ఇస్తాడు. ఆ వాచీ చూసిన అననిక చాలా సంతోషిస్తుంది. చాలా బాగుంది అని కళ్యాణ్ కి చెప్తుంది. మనం కలిసిన ఈ క్షణం ఎప్పుడూ గుర్తుండాలని ఈ వాచ్ నీకి గిఫ్ట్ గా ఇచ్చాను అంటాడు కళ్యాణ్.
 

58

అప్పటికే అప్పు రెండు మూడు సార్లు ఫోన్ చేస్తుంది. రెండుసార్లు ఫోన్ కట్ చేసేసిన కళ్యాణ్ మూడోసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. వాడికి అవసరమైన ప్రతిసారి నేను వెళ్ళాను నాకు అవసరమయ్యేటప్పటికీ తప్పించుకుంటున్నాడు, రానీ వాడి పని చెప్తాను అనుకుంటుంది అప్పు. ఇంపార్టెంట్ కాల్ ఏమో ఎత్తండి అంటుంది అనామిక. పర్వాలేదు అంత ఇంపార్టెంట్ కాల్ కాదు అంటాడు  కళ్యాణ్. ఆ తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ అనుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు అనామిక, కళ్యాణ్.
 

68

మరోవైపు రాజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భోజనాల దగ్గర కూర్చుంటారు. ఇన్నాళ్లు వరలక్ష్మి వ్రతం బాధ్యతలు నా కోడలు అపర్ణ చూసుకునేది ఇప్పుడు తన కోడలు కావ్యకి బాధ్యతలు అప్పగిస్తున్నాను అంటుంది చిట్టి. పర్వాలేదు అమ్మమ్మ గారు అత్తయ్య గారి పర్యవేక్షణలోనే పూజని జరగనివ్వండి. నేను చిన్న అత్తయ్య సాయం చేస్తాము అంటుంది కావ్య. ఇన్నాళ్లు నా మాట నా కోడలు వినేది కాదు.
 

78

 ఇప్పుడు నీ కోడలు వినడం లేదు. మేము కాశీకి వెళ్ళిపోతాం అని సుభాష్ తో చెప్తుంది చిట్టి. నీ మాట వింటుంది లే అని తల్లికి సర్ది చెప్తాడు సుభాష్. కావ్య కూడా మీ ఇష్టమే అమ్మమ్మ గారు అంటుంది. మరోవైపు కోపంతో రగిలిపోతున్న అప్పుని చూస్తాడు కళ్యాణ్. తప్పు చేశాను కదా తలొంచుకోవాలి తప్పదు అనుకుంటూ అప్పుకి ఎదురుపడతాడు. ఆమె కోపంతో నానా చివాట్లు పెడుతుంది. అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయవలసిన అంత ఇంపార్టెంట్ పని ఏముంది అని అడుగుతుంది.
 

88

అనామిక కలుస్తానంది అందుకే అంటాడు కళ్యాణ్. తరువాయి భాగంలో ఇంట్లో అందరూ నీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, నువ్వు ఇంట్లో ఇలా తిరుగుతుంటే నేను భరించలేక పోతున్నాను అని కావ్యతో అంటుంది అపర్ణ. మీ అబ్బాయి మీ మనసు మారుస్తారేమో అంటుంది కావ్య. ఆ తర్వాత కావ్య తో  పూజ నువ్వు చెయ్యు ఫలితం నేను ఇస్తాను అంటాడు రాజ్. ఏమిస్తారు అంటుంది కావ్య. వెయిట్ అండ్ సీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్.

click me!

Recommended Stories