మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు టాప్ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఒకప్పుడు గ్లామర్ పాత్రలతో అలరించిన తమన్నా, ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, అలాగే బోల్డ్ కంటెంట్ ఉన్న మూవీస్ చేస్తూ ఆకట్టుకుంటుంది. బోల్డ్ అండ్ ఇంటెన్స్ రోల్స్ తోనూ షాకిస్తుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇలా అన్ని రకాలుగా దూసుకుపోతుంది తమన్నా.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తమన్నా ప్రస్తుతం నటుడు విజయ్ వర్మతో లవ్ లో ఉన్న విషయం తెలిసిందే. గత కొన్నాళ్లుగా ఈ ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరగుతున్నారు. పబ్లిక్ ఈవెంట్లలోనూ కలిసే కనిపిస్తున్నారు. తమ రిలేషన్‌ని ఓపెన్‌గానే తెలియజేస్తున్నారు. ఇద్దరూ ఒకే రంగంలో ఉండటంతో, ఇద్దరి మనసులు కలవడం, ఇద్దరూ మెచ్యూర్డ్ పర్సన్స్ కావడంతో వీరి ప్రేమకి పేరెంట్స్ నుంచి అడ్డు లేదు. అయితే ఇటీవల ఈ ఇద్దరు కలిసి కనిపించడం తగ్గింది. దీంతో విడిపోయారా? అనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తమన్నా, విజయ్ వర్మ రిలేషన్‌పై ఓ డౌట్ అయితే ఉంది.
అయితే ఇప్పుడే కాదు ఆల్‌రెడీ రెండు సార్లు లవ్ బ్రేకప్ అయ్యిందట తమన్నాకి. గతంలో ఓ వ్యక్తితో ట్రావెల్ అయ్యిందట, కానీ అతను తనని అర్థం చేసుకోలేకపోవడంతో బ్రేకప్ చెప్పిందట. ఆ తర్వాత మరో వ్యక్తితోనూ ప్రేమలో పడింది. డేటింగ్ కూడా చేసింది. కానీ ఆయనతో జీవితం అంతా అబద్దంలా ఉంటుందనే భావనకు వచ్చిందట.
దీంతో ఆ రిలేషన్‌కి కూడా బ్రేకప్ చెప్పింది. అయితే బయటకు తెలిసిన రూమర్లుగా వినిపించేవి ఈ రెండు బ్రేకప్‌లు మాత్రమే. కానీ మరో బ్రేకప్ తమన్నా జీవితంలో ఉంది. స్కూలింగ్‌లోనే కావడం విశేషం. తన ఫస్ట్ క్రష్ వివరాలు బయటపెట్టింది తమన్నా.
స్కూలింగ్ టైమ్‌లో తమన్నా తన ఫ్రెండ్ అన్ననే ప్రేమించిందట. చాలా రోజులు ఆయన్ని ఆరాధించిందట. ఎట్టకేలకు తన క్రష్ విషయాన్ని ఆయనకు చెప్పగా, అతను చెప్పిన సమాధానం విని తమన్నాకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. తన చెల్లి ఫ్రెండ్ తమన్నా కావడంతో అతను నిన్ను కూడా చెల్లిలానే ఫీలవుతున్నా అని చెప్పాడట. దెబ్బకి తమన్నా మతిపోయిందట. ఏంటి ? ఇలా చెప్పాడని షాక్ అయ్యిందట.
ఆ తర్వాత కొన్ని రోజులు బాగా ఫీలయ్యింది. అంతేకాదు ఆయన్ని అలానే చాలా రోజు ఇష్టపడింది. ఆ తర్వాత వదిలేసిందట. అయితే తమన్నా ఏ ఏజ్‌లో ఈ ప్రేమలో పడిందో తెలిస్తే మీరూ షాక్ అవుతాడు. తను 5వ తరగతిలో ఉందట. అతను 8వ తరగతి చదువుతున్నాడట. ఏమీ తెలియని ఏజ్‌లో తమన్నాకి ఫ్రెండ్ అన్న మీదనే క్రష్ ఏర్పడింది. ప్రపోజ్ కూడా చేసింది. అతన్నుంచి రిజెక్షన్ కూడా ఫేస్ చేసింది తమన్నా.
అయితే తాను ఇంత అందంగా ఉంటుంది. టాలెంటెడ్, డేరింగ్ కూడా. మరి ఎవరూ మీకు లవ్ ప్రపోజ్ చేయలేదా? అంటే తమన్నాకి ఎవరూ ప్రపోజ్ చేయలేదట. ఆ వెలితి ఇప్పటికీ ఉండిపోయిందని చెప్పింది తమన్నా. చెప్పుకోవడానికి అలాంటి మెమరీస్ లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేసింది.
దీంతో తనే ఇష్టపడటం స్టార్ట్ చేసిందట. అలా బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చిందని చెప్పింది తమన్నా. ప్రదీప్ యాంకర్ గా ఉన్న `కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా` టాక్ షోలో ఈ విషయాన్ని వెల్లడించింది తమన్నా. ఇకమోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన తమన్నా 2005లో `చాంద్ సా రోషన్ చెహ్ర` చిత్రంలో నటించింది. వెండితెరకు పరిచయం అయ్యింది.
అదే ఏడాది తెలుగులో `శ్రీ` సినిమాలో మంచు మనోజ్ సరసన నటించి టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. `హ్యాపీడేస్` మూవీతో బ్రేక్ అందుకుని బిజీ హీరోయిన్ అయిపోయింది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా గ్లామర్‌కి ఐకాన్‌గా నిలిచింది. గ్లామర్ క్వీన్‌గా ఓ ఊపు ఊపేసిన తమన్నా.. ఇటీవల సెలక్టీవ్‌గా వెళ్తుంది.
ఆ మధ్య `అరన్మణై 4`లో రచ్చ చేసింది. `స్ట్రీ2`లో స్పెషల్ సాంగ్‌లో దుమ్ములేపింది. సంచలనంగా ఈ పాట మారడం విశేషం. ప్రస్తుతం తమన్నా `సికండర్ కా కా ముఖ్‌దార్` చిత్రాల్లో నటిస్తుంది. తెలుగులో `ఓడెల 2`లో చేస్తుంది. శివ శక్తి పాత్రలో ఆమె కనిపించి విశ్వరూపం చూపించేందుకు రెడీ అవుతుంది.
read more; హరికృష్ణ కూతురు పెళ్లికి వెళ్లొద్దని అడ్డుకున్న లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ ఏం చేశాడో తెలిస్తే మతిపోతుంది!