టబు, శోభన, నగ్మా, జయప్రద, రేఖ, సితార.. ఒంటరి అందాల తారలు.. ఆ దారిలో సమంత?

First Published | Jan 4, 2022, 5:47 PM IST

ఒకప్పుడు అందాలతో సినీ ఆడియెన్స్ ఓఊపుఊపిన అందాల ముద్దుగుమ్మలు ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్నారు. టబ్‌, శోభన, నగ్మా, జయప్రద, రేఖ, సితార, అమీషా పటేల్‌ వంటి వారు యాభై పదుల వయసులోనూ ఒంటరిగానే జీవిస్తున్నారు. మరి సమంత పరిస్థితేంటనేది ఆసక్తికరంగా మారింది. 

హీరోయిన్ల కెరీర్‌ పీక్‌లోకి వెళ్లిన తర్వాత  పెళ్లెప్పుడనే ప్రశ్నలు తరచూ ఎదురవుతుంటాయి. ప్రశ్నలు దాటవేస్తూ మొత్తానికి నలభై లోపు పెళ్లి చేసుకుంటారు. ఏ వ్యాపారవేత్తనో చూసుకుని జీవితంలో సెటిల్‌ అయిపోతారు. భర్త ప్రోత్సహిస్తే క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా రాణిస్తారు. లేదంటే ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమవుతుంటారు. కానీ కొందరుస్టార్‌ హీరోయిన్లు మాత్రం ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయారు. మరికొందరు మ్యారేజ్‌ చేసుకున్నా అది నిలవకపోవడంతో, ఇంకొందరు ప్రేమలో విఫలమై ఒంటరిగానే ఉండిపోయారు. మరి ఆ నటీమణులెవరో ఓ లుక్కేద్దాం. 

యాభై ఏళ్లు దాటినా ఇంకా ఒంటరిగానే ఉంది భారీ అందాల భామ టబు. తెలుగు, హిందీలో ఓ ఊపు ఊపిన ఈ హాట్‌ భామ.. బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌తో ప్రేమాయణం నడిపించింది. ఆయన్ని గాఢంగా ప్రేమించింది. కానీ అజయ్‌ దేవగన్‌..కాజోల్‌ని పెళ్లిచేసుకోవడంతో టబు మాత్రం ఒంటరిగానే ఉండిపోయింది. తన మనసులో మరొకరికి చోటు లేదని సింగిల్‌ లైఫ్‌ని అనుభవిస్తుంది. ఇప్పటికీ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తుంది టబు. 


మరో అందాల తార నగ్మా సైతం ఇప్పటికీ ఒంటరిగానేఉంది. నగ్మా.. టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీతో ప్రేమలో పడింది. గంగూలీ మ్యారేజ్‌ తర్వాత వీరిద్దరు ప్రేమలో మునిగి తేలారు. ఒకానొక దశలో వీరిద్దరు మ్యారేజ్‌ చేసుకోబోతున్నారనే టాక్‌ కూడా వినిపించింది. కానీ గంగూలీకి, తన భార్యకి మధ్య జరిగిన గొడవ ఫలితంగా.. నగ్మాతో తనకు రిలేషన్‌ లేదని చెప్పాడు గంగూలీ. దీంతో హర్ట్ అయిన నగ్మా.. పెళ్లి చేసుకోకుండా ఇప్పటికీ ఒంటరిగానే ఉంది. అరుదుగా సినిమాలు చేస్తూ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు నగ్మా. 

అద్భుతమైన నటిగా రెండు జాతీయ అవార్డులు గెలుచుకుని, తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో 1980, 90లో స్టార్‌ హీరోయిన్‌గా వెలిగింది శోభన. భరతనాట్యకారిణిగానూ జాతీయ స్థాయిలోగుర్తింపు తెచ్చుకున్న శోభన ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. కళామతల్లి సేవాలో మునిగిపోయి పెళ్లి జీవితానికి దూరంగా ఉంది. ఓ అమ్మాయిని దత్తత తీసుకుంది. 
 

తెలుగులో `నాని`, `నరసింహుడు`, `పరమవీరచక్ర` వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన అమీషా పటేల్‌.. కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. 46ఏళ్ల ఈ భామ ఫిల్మ్ మేకర్‌ విక్రమ్‌ భట్‌తో ప్రేమాయణం సాగించింది. చాలా రోజులు వీరి లవ్‌ స్టోరీ నడించింది. పలు వివాదాలను ఎదుర్కొంది. అనేక వివాదాల అనంతరం వీరిద్దరు బ్రేకప్‌ చెప్పుకున్నారు. ఆ తర్వాత వ్యాపారవేత్త కనవ్‌ పూరితో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించారు. తమ ప్రేమని ప్రకటించి పదేళ్లు అవుతున్నా ఇంకా పెళ్లి చేసుకోలేదు. మ్యారేజ్‌ చేసుకునే ఉద్దేశం లేదని తెలుస్తుంది. 

క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్న సితార సైతం మ్యారేజ్‌ చేసుకోలేదు. ఒకప్పుడు హీరోయిన్‌గా మెప్పించిన ఆమె తమిళ నటుడు మురళీ ప్రేమలో పడింది. కొన్ని కారణాలతో వీరిద్దరు విడిపోయారు. ఆ ప్రేమ విఫలం కావడంతో హర్ట్ అయిన సితార ఇప్పటికీ ఒంటరిగానే ఉండిపోయింది. ప్రస్తుతం ఆమె సౌత్‌లో తల్లి పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. 

అలనాటి అందాల తార రేఖ ఇప్పటికీ ఒంటరిగానే ఉంటుంది. ఆమె 1990లో ఢిల్లీ బేస్డ్ వ్యాపారవేత్త ముఖేష్‌ అగర్వాల్‌ని వివాహం చేసుకుంది. ఆయన డిప్రెషన్‌ కారణంగా అదే ఏడాది ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే రేఖకి అంతకు ముందు నుంచే బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌తో ప్రేమలో ఉంది. అంతకు ముందు నటుడు వినోద్‌ మెహ్రాని మ్యారేజ్‌ చేసుకున్నారనే రూమర్స్ వినిపించాయి. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. అయితే తన భర్త చనిపోవడం, అమితాబ్‌ని మర్చిపోలేకపోవడంతో రేఖ ఒంటరిగానే ఉండిపోయింది. 

తెలుగుకి చెందిన అలనాటి అందాల తార జయప్రద సింగిల్‌గానే ఉంది. ఆమె 1986లో నిర్మాత శ్రీకాంత్‌ నహతాని వివాహం చేసుకుంది. కానీ అప్పటికే అతనికి పెళ్లై ముగ్గురు పిల్లలున్నారు.ఈ విషయం తెలిసి అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆయనకు దూరంగా ఉంటుంది జయప్రద. మరో పెళ్లి చేసుకోలేదు, అలాగని విడాకులు తీసుకోలేదు. కానీ ఒంటరిగానే ఉంటుంది. తన చెల్లెలి కుమారుడిని పెంచుకుంటుంది. సమాజ్‌ వాది పార్టీ నేత అమర్‌ సింగ్‌ శిష్యురాలిగా ఉండిపోయింది జయప్రద. 

సీనియర్‌ నటి నిర్మల కూడా మ్యారేజ్‌ చేసుకోలేదు. ఆమె ఎంజీఆర్‌తో ప్రేమలో పడింది. ఆ ప్రేమ విఫలం కావడంతో ఒంటరిగానే ఉండిపోయింది. ప్రస్తుతం ఆమె అమ్మ పాత్రల నుంచి బామ్మ పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.
 

మరో సీనియర్‌ నటి `ముత్యాల ముగ్గు` సంగీత కూడా ఒంటరిగానే ఉంది. ఆమె కూడా ఎంజీఆర్‌ ప్రేమలో పడింది. చాలా రోజులు ఆయనకు సన్నిహితంగా ఉంది. కానీ పెళ్లి చేసుకునే అవకాశం లేకపోవడం, ఆయన చనిపోవడంతో ఆ బాధలో ఒంటరిగానే ఉందని సమాచారం. 
 

ఇదిలా ఉంటే ఇప్పుడు సమంత సైతం వీరి జాబితాలో చేరబోతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సమంత ఎంతగానో ప్రేమించి నాగచైతన్యని పెళ్లి చేసుకున్న విసయం తెలిసిందే. 2017లో వీరిద్దరి గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. సరిగ్గా నాలుగేండ్లకి గతేడాది అక్టోబర్ 2న విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రేమ పెళ్లిలో విఫలమైన బాధలో ఉన్న సమంత ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో కెరీర్‌పై దృష్టి పెట్టింది. మరి ఆమె భవిష్యత్‌లో మ్యారేజ్‌ చేసుకుంటుందా? లేక పైన చెప్పినట్టు ఆయా నటీమణులు మాదిరిగా ఒంటరిగానే ఉండిపోతుందా? అనేది ఆసక్తిగా మారింది. 

also read: కుందనపు బొమ్మలా మెరిసిపోతూ సమంత కనువిందు.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌.. గతాన్ని మర్చిపోలేకపోతుందా ?

also read:Rakul Version 2.0: అందాల డోస్‌ పెంచిన రకుల్‌ ప్రీత్‌సింగ్‌.. నెవర్‌ బిఫోర్‌ అనిపిస్తున్న హాట్‌ పోజు

Latest Videos

click me!