54 ఏళ్ల టబు రిజెక్ట్ చేసిన 6 సినిమాలు, వాటి IMDb రేటింగ్స్

Published : Nov 05, 2025, 08:05 AM IST

ఇాండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యాచిలర్  అండ్  పాపులర్ హీరోయిన్  టబు. తాజాగా  54వ ఏట అడుగుపెట్టిన  టబు..  తన కెరీర్‌లో చాలా పెద్ద సినిమాలను రిజెక్ట్ చేశారు. ఆ సినిమాలేంటి.. అవి ఎంత హిట్ అయ్యాయి.? 

PREV
17
టబు రిజెక్ట్ చేసిన సినిమాలు

టబు తన సుదీర్ఘ సినిమా కెరీర్‌లో చాలా హిట్ సినిమాల్లో నటించారు. సౌత్ భాషల్లో కాదు.. బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోలందరిని ఆమె కవర్ చేశారు.  అయితే కెరీర్ లో టబు చాలా  సినిమాలను తిరస్కరించారు. ఆమె రిజెక్ట్  చేసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. 

27
మున్నాభాయ్ ఎంబీబీఎస్

2003లో రిలీజైన బ్లాబ్ బస్టర్ మూవీ  'మున్నాభాయ్ ఎంబీబీఎస్'లో గ్రేసీ సింగ్ పాత్రకు మొదట టబుని సంప్రదించారు. కానీ ఆమె తిరస్కరించారు. ఈ సినిమా IMDb రేటింగ్ 8.1.

37
కుచ్ కుచ్ హోతా హై

షారుఖ్ ఖాన్ హీరోగా.. 1998లో 'కుచ్ కుచ్ హోతా హై' సినిమా రిలీజైంది. ఈ చిత్రంలో రాణి ముఖర్జీ నటించిన పాత్ర కోసం మొదట టబుని అడిగారట నిర్మాతలు. కానీ టబు ఈసినిమా చేయలేదు. . దీనికి IMDbలో 7.5 రేటింగ్ వచ్చింది.

47
బధాయి హో

2018లో వచ్చిన 'బధాయి హో'లో నీనా గుప్తా పాత్రను మొదట టబుకి ఆఫర్ చేశారు. కానీ, ఆమె దాన్ని తిరస్కరించారు. ఈ సినిమాకి IMDbలో 7.9 రేటింగ్ వచ్చింది.

57
లజ్జా

2001లో రిలీజైన 'లజ్జా' సినిమాలో మనీషా కోయిరాలా పాత్ర కోసం టబుని సంప్రదించారు. కానీ ఈ పాత్ర చేయడానికి టబు నిరాకరించారు. కానీ  ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీనికి IMDbలో 6.6 రేటింగ్ వచ్చింది.

67
మన్

ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన మన్ సినిమా 1999లో 'రిలీజైంది. ఈ సినిమా మేకర్స్ మొదటి ఛాయిస్ టబు. కానీ, ఆమె రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఈ సినిమా మనీషా కోయిరాలాకు దక్కింది. దీని IMDb రేటింగ్ 6.2.

77
కభీ అల్విదా నా కెహనా

2006లో 'కభీ అల్విదా నా కెహనా' సినిమా రిలీజైంది. ఇందులో షారుఖ్ ఖాన్ జోడీగా..  రాణి ముఖర్జీ నటించిన  పాత్రను టబుకి ఆఫర్ చేశారు. కానీ, ఆమె ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. ఈ సినిమా IMDb రేటింగ్ 6.1.

Read more Photos on
click me!

Recommended Stories