ఉత్తమనటిగా హ్యాట్రిక్ కొట్టిన తాప్సీ.. అరుదైన రికార్డ్ సాధించిన సొట్టబుగ్గల సుందరి

Published : Dec 23, 2022, 11:49 AM ISTUpdated : Dec 23, 2022, 11:54 AM IST

తనకంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది తాప్సీ పన్ను. తానేంట్ నిరూపించుకున్న ఈ బ్యూటీ.. మూడు సార్లు ఉత్తమ నటిగా ఎంపికయ్యింది. సరికొత్త రికార్డ్ సాధించింది. 

PREV
16
ఉత్తమనటిగా హ్యాట్రిక్ కొట్టిన తాప్సీ.. అరుదైన రికార్డ్ సాధించిన సొట్టబుగ్గల సుందరి

బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ హీరోయిన్లలో తాప్సీ ఒకరు. ముక్కుసూటి మనస్తత్వంతో పాటు.. పొరపాట్లను ఎత్తిచూపేమనస్తతత్వం తాప్సీది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వలస వెళ్లిన ఈ పంజాబీ భామ.. అక్కడ తన మార్క్ నటనతో రెచ్చిపోయింది. ఈ మధ్య కాస్త అవకాశాల విషయంలో వెనకబడుతుంది తాప్సీ.. కాని ఓటీటీలకు మాత్రం బ్రాండ్ గా మారింది. 

26
Taapsee Pannu

సినిమాలకంటే ఎక్కువ ఓటీటీ కంటెంట్ లో మెరుస్తుంది తాప్సీ. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై ఎక్కువగా అవకాశాలు అందుకుంటుంది. అవకాశాలతో పాటు అవార్డ్ లు కూడా తాప్సీనే సాధిస్తోంది. ఎవరికి సాధ్యం కాని వండర్స్ క్రియేట్ చేస్తోంది బ్యూటీ. ఇక ఓటీటీకే పరిమితం అవుతుందోఏమో అంటున్నారు ఫ్యాన్స్. 

36

ఓ ఐపు భారీ సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు ఓటీటీ ప్రాజెక్టులు కూడా చేస్తోంది. తాప్సీ వెబ్‌ ఒరిజినల్‌ ఫిలిం లూప్‌ లపేటాకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ ఓటీటీ అవార్డు ను కూడా అందుకుంది. 2020 సంవత్సరానికి గాను సాండ్‌ కీ ఆంఖ్‌.. 2021 సంవత్సరానికి గాను  థప్పడ్‌ సినిమాకు వరుసగా అవార్డ్స్ అందుకున్న  తాప్సీ,...  ఉత్తమ నటిగా ముచ్చటగా మూడో సారి 2022 కు గాను ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. 

46

ఝుమ్మంది నాదం సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది బ్యూటీ.. తెలుగు సినిమాతోనే తొలిసారి  సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది  తాప్సీ పన్ను. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. 
 

56
Taapsee Pannu

ఇక తనకు మూడోసారి అవార్డ్ రావడంపై స్పందించింది సీనియర్ బ్యూటీ. లూప్‌ లపేటా సినిమాను నేనెందుకు చేయాలనుకుంటున్నానో.. రన్ లోలా రన్ లాంటి క్లాసిక్‌ని నేను ఎందుకు టచ్ చేయాలనుకుంటున్నానో ఎవరికీ అర్థం కాలేదు.. అని అవార్డు గెలుచుకున్న తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టింది తాప్సీ.
 

66
Taapsee Pannu

ప్రస్తుతం తాప్సీ సౌత్ లో కాస్త యాక్టీవ్ గా ఉంటోంది.  తమిళంలో జనగణమన, ఏలియన్ సినిమాల్లో నటిస్తోన్న  తాప్సీ... హిందీలో వో లడ్‌కీ హై కహాన్‌తోపాటు రాజ్‌కుమార్‌ హిరానీ డైరెక్షన్‌లో షారుఖ్‌ ఖాన్ హీరోగా నటిస్తోన్న డుంకీ  సినిమాల్లో నటిస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories