కాలంతో పాటు మనుషులు, ఆలోచనా విధానాలు మారిపోతున్నాయి. హౌస్ వైఫ్ అయినంత మాత్రాన ఎలాంటి గుర్తింపు లేకుండా నాలుగు గోడల మధ్య బ్రతికేయాలా అని ప్రశ్నిస్తున్నారు ఈ తరం భార్యలు. తమకంటూ గుర్తింపు, గౌరవం కోరుకుంటున్నారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి సోషల్ మీడియా సెలబ్రిటీ అయ్యారు. కేవలం బన్నీ భార్యగా కాకుండా సపరేట్ ఇమేజ్ కోరుకుంటున్నారు.