ఆనందంలో మునిగి, తేలుతున్న తాప్సీ, ఆ అవకాశం రావడమే కారణమట

Published : Apr 29, 2022, 10:18 AM IST

పట్టలేని సంతోషంలో మునిగి తేలుతుంది హీరోయిన్ తాప్సీ పన్ను. తనకు వచ్చిన అవకాశంతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తన కల నెరవేరిందట. ఇంతకీ ఆమె ఆనందానికి కారణం ఏంటీ అంటే షారుఖ్ ఖాన్ తో నటించే అవకాశం రావడమే.  

PREV
17
ఆనందంలో మునిగి, తేలుతున్న తాప్సీ, ఆ అవకాశం రావడమే కారణమట

పట్టలేని సంతోషంలో మునిగి తేలుతుంది హీరోయిన్ తాప్సీ పన్ను. తనకు వచ్చిన అవకాశంతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తన కల నెరవేరిందట. ఇంతకీ ఆమె ఆనందానికి కారణం ఏంటీ అంటే షారుఖ్ ఖాన్ తో నటించే అవకాశం రావడమే.

27

పంజాబీ ముద్దుగుమ్మ తాప్సీ పట్టరాని ఆనందంతో మేఘాల్లో తెలిపోతున్నది. ఈ భామ జోష్‌కు కారణం..బాలీవుడ్‌ బాద్షా షారుఖ్‌ ఖాన్‌ సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకోవడమే. రాజ్‌కుమార్‌ హిరాని డైరెక్షన్ లో షారుఖ్‌ఖాన్‌ హీరోగా తెరకెక్కనున్న సినిమా డంకీ. ఈమూవీలో హీరోయిన్ గా తాప్సీ సెలెక్ట్ అయ్యింది. 

37

బాలీవుడ్ లో షారుఖ్ తో నటించడం అంటే గొప్ప అదృష్టంగా భావిస్తుంటారు హీరోయిన్లు. ఇక ఆ అదృష్టం ఇంత కాలానికి తాప్సీని వరించింది. దాంతో దిల్ ఖుష్ అవుతోంది హీరోయిన్. అంతే కాదు షారుఖ్ తో నటించడానికి ముందు నుంచే ప్రీపేర్ అవుతుంది తాప్సీ. 
 

47

తన కెరీర్‌ మొత్తంలో ఇదే అద్భుతమైన అవకాశమని..షారుఖ్‌ఖాన్‌తో కలిసి నటిస్తానని కలలో కూడా ఊహించలేదని తాప్సీ సంబరపడిపోతుంది. ఇదంతా తనకు  ఓ కలలా అనిపిస్తుందట. షారుఖ్‌ నటననే కాదు, ఆయన వ్యక్తిత్వాన్ని కూడా నేను ఎంతగానో ఇష్టపడతానంటోంది సొట్టబుగ్గల సుందరి. 
 

57

ఇక షారుఖ్ తో నటించబోతుంది కాబట్టని ఆయనతో తన షూటింగ్ టైమ్ ను ఎలా స్పెండ్ చేస్తుందో వివరంగా చెప్పింది తాప్సీ. ఆయన స్ఫూర్తిదాయక సినీ ప్రయాణం తో పాటు ఫిల్మ్  ఇండస్ట్రీలో షారుఖ్ కు ఎదురైన అనుభవాల గురించి తెలుసుకోవడానికి రెడీగా ఉందట తాప్సీ. 
 

67

షారుఖ్ నుంచి కొన్ని విషయలు తెలుసుకోవడానికి రెడీ అవుతోంది బ్యూటీ. సెట్స్‌లో ఖాళీ టైమ్ దొరికితే షారుఖ్‌ఖాన్‌ జీవితానుభవాల్ని ఆయన మాటల్లోనే విందామని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటోంది బ్యూటీ. 
 

77

తాప్సీ పన్ను టాలీవుడ్ నుంచి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఇక్కడ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ చేరి, అక్కడ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సాధించింది. మిమెన్ సెంట్రిక్ మూవీస్ తో బాలీవుడ్ లో స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్న తాప్సీ.. అమితాబ్ లాంటి స్టార్స్ తో కలిసి స్క్రీన్ శేర్ చేసుకుంది. 

Read more Photos on
click me!

Recommended Stories