Manchu Vishnu: మంచు విష్ణు ట్వీట్ వైరల్.. ఆచార్యతో ముడిపెడుతున్న నెటిజన్లు

Published : Apr 29, 2022, 10:06 AM IST

మంచు విష్ణు ఇటీవల కొన్ని నెలలుగా మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాడు. మా అసోసియేషన్ ఎన్నికల్లో విష్ణు ప్రకాష్ రాజ్ పై విజయం సాధించి మా ప్రెసిడెంట్ గా ఎన్నికైన సంగతి తెలిసిందే.

PREV
16
Manchu Vishnu: మంచు విష్ణు ట్వీట్ వైరల్.. ఆచార్యతో ముడిపెడుతున్న నెటిజన్లు

మంచు విష్ణు ఇటీవల కొన్ని నెలలుగా మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాడు. మా అసోసియేషన్ ఎన్నికల్లో విష్ణు ప్రకాష్ రాజ్ పై విజయం సాధించి మా ప్రెసిడెంట్ గా ఎన్నికైన సంగతి తెలిసిందే. విష్ణు మా ప్రెసిడెంట్ అయ్యాక అతడు చెప్పే ప్రతి మాట మీడియాలో వైరల్ అవుతోంది.   

26

కొన్ని సంబంధం లేని విషయాల్లో కూడా మంచు విష్ణు ప్రస్తావన వస్తోంది. బహుశా నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారో.. లేక మంచు విష్ణు టైమింగ్ రాంగో తెలియదు కానీ.. అతడు చేసిన లేటెస్ట్ ట్వీట్ వైరల్ అవుతోంది. ఈరోజు ఉదయం 5 గంటలకే మంచు విష్ణు ఈ ట్వీట్ చేశాడు. 

36

'డాన్స్ రిహార్సల్స్ మొదలయ్యాయి. దీనితో నా ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి' అంటూ విష్ణు ట్వీట్ చేశాడు. దీనితో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మంచు విష్ణు ట్వీట్ చేసే సమయానికి యూఎస్ ప్రీమియర్స్ నుంచి ఆచార్య చిత్రానికి టాక్ మొదలైపోయింది. 

 

46

టాక్ ఆశించిన విధంగా లేదు. మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. అదే టైంకి విష్ణు ఇలా ట్వీట్ చేయడంతో నెటిజన్లు ఆచార్యతో ముడిపెడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఆచార్య చిత్రాన్ని ట్రోల్ చేయడానికే పొద్దునే ఈ ట్వీట్ చేశాడు అని అంటున్నారు. పైగా చాలా కాలం నుంచి మెగా మంచు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. 

56

గతంలో మంచు, మెగా ఫ్యామిలీ మధ్య సఖ్యత నెలకొన్నట్లే కనిపించింది. కానీ మా ఎన్నికల నేపథ్యంలో విభేదాలు మళ్ళీ మొదలయ్యాయి. ప్రస్తుతం మంచు విష్ణు 'గాలి నాగేశ్వర రావు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో డాన్స్ గురించే విష్ణు ట్వీట్ చేసి ఉండొచ్చు. 

66

కానీ నెటిజన్లు మాత్రం ఆచార్య గురించే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. గాలి నాగేశ్వరరావు చిత్రంలో విష్ణు సరసన శృంగార తార సన్నీలియోన్, హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. 

click me!

Recommended Stories