టాలీవుడ్ నుంచి హీరోయిన్ గా పరిచయం అయ్యి.. ఇక్కడ పెద్దగా అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ చేరింది తాప్సీ పొన్ను. అక్కడ ఫైర్ బ్రాండ్ గుర్తింపు పొందింది. వాళ్లు వీళ్లు అని లేకుండా ఎవరినైనా సరే బహిరంగాంగానే విమర్షిస్తూ.. రకరకాల సమస్యలపై స్పందిస్తూ.. తన మార్క్ చూపించుకుంటుంది తాప్సి.
ఇక తాప్సీ అంటే అందరికి గుర్తకు వచ్చేది అందమైన సొట్టబుగ్గలు, మంచి వంపులు తిరిగిన వయ్యారి సొగసులు, ముద్దుగా, బొద్దుగా.. చక్కగా ఉండే తాప్సీ.. ఈ మధ్య పూర్తిగా మారిపోయింది. అసలు ఈమె తాప్సీననే అనే విధంగా మారిపోయింది. స్లిమ్ గా, నాజూగా తయారయిన తాప్సీని చూసి ఇలా ఎలా తయారయ్యిందంటూ షాక్ అవుతున్నారు ఆడియన్స్.
అంత స్లిమ్ గా అవ్వడానికి తాస్పీ ఏం చేసింది..? అంత లావుగా ఉన్న ఈ బ్యూటీ ఇలా నాజూగ్గా మారడానికా కారణం ఏంటీ. ఈ విషయంలో ఎలాంటి స్పందనలు వస్తున్నాయి. అసలు ఈ విషయంలో తాప్సీ ఏం చెప్పింది..? ఎందుకలా మారింది..? ఆ సీక్రేట్ ఏంటి..?
ఈ విషయంలో తాప్సీ ఏమన్నదంటే.. ఒకప్పుడు నేను కాస్త బొద్దుగా ఉన్న మాట వాస్తవమే. కాని ఇప్పుడు మాత్రం ఏక్‌దమ్ ఫిట్ గా మారాను. ఈ స్లిమ్‌నెస్‌కు కారణం డైట్‌లో చేసుకున్న చిన్నచిన్న మార్పులే. నిజానికి నాకు కడుపునిండా తినడమే ఇష్టం. కానీ అది తప్పని తెలుసుకున్నా. జీవక్రియ సరిగ్గా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు అంటుంది తాప్సీ.
ఒకప్పుడు రోజుకు రెండుసార్లు భోజనం చేసేదాన్ని. కాని ప్రస్తుతం ఐదారుసార్లు కొద్దికొద్దిగా తింటున్నా. ప్రతిసారీ ఒకే మోతాదులో తీసుకుంటే జీవక్రియ దెబ్బతినదు అంటూ తన సీక్రేట్ చెప్పేసింది తాప్సీ. ఒకేసారి పెద్ద మోతాదులో కడుపునిండా తినడం వల్ల ఉభకాయం సమస్యలుఏర్పడతాయి అంటోంది తాప్సీ.
ఇక తాస్పీ మెనూ చూసుకుంటే బ్రేక్‌ఫాస్ట్‌లో దక్షిణాది ఇడ్లీ సాంబార్ ఉండాల్సిందే. లంచ్‌లో రోటీ, దాల్, సబ్జీ, పెరుగు. ఎండాకాలం కాబట్టి కోకోనట్ షేక్ విత్ మలాయ్ లాంటివి పక్కాగా తన మెనూలో ఉండేట్టు చూసుకుంటుందట తాప్సీ. ఇక స్నాక్స్‌గా నట్స్ తీసుకుంటా. రాత్రికి కిచిడి, సుషి, ఫిష్, థాయ్ కర్రీ లాంటివి కలుపుకుని ఇదీ నా మెనూ అంటుంది తాప్సీ పన్నూ.
అయితే తాప్సీ మరో విషయం స్పష్టం చేసింది. రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లానే ఉండు అనే సామెత చెప్పినట్టు ఆ పద్ధతిని నేను తప్పక పాటిస్తాను అంటుంది తాప్సీ. ఎక్కడికెళితే అక్కడి వంటకాలను టేస్ట్ చేస్తాను. లక్నో వెళితే చాట్, మటన్ ఆరగించాల్సిందే. జైపూర్ వెళితే దాల్ బాటీతో దోస్తీ... అయితే ఎన్ని తిన్నా.. ఎక్కడికి వెళ్లినా మారని మాత్ర తన వ్యాయామమే అంటోంది బ్యూటీ. ఉదయాన్నే వర్క్ అవుట్స్ మాత్రం తప్పనిసరి అంటోంది.
నిజానికి మనం పూర్వికులు అందించిన ఉత్తమ ఆహార పద్ధతులను మానేసి ఫ్యాన్సీ ఫుడ్‌కు అలవాటు పడిపోయాం. వాటివల్ల అధిక బరువుతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. సంప్రదాయ వంటలే ఒంటికి మంచిదని హితవు పలుకుతోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను.