
చాలా కాలం క్రితం రాఘవేంద్రరావు, మంచు మనోజ్ కాంబినేషన్ లో రూపొందిన ఝుమ్మంది నాధం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై..అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది తాప్సీ. ఒకానొక సమయంలో తెలుగులో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. హిందీలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో అందరి నోట్లో నానే తాప్సీ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
కొన్ని రోజుల క్రితం తాప్సీ, తన బాయ్ ఫ్రెండ్ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్(Mathias Boe) ని పెళ్లి చేసుకుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గత పదేళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ తాప్సీ, మథియాస్ ఎప్పుడూ వాటిపై స్పందించలేదు.
అయితే పది రోజుల క్రితం తాప్సీ, మథియాస్ బోయ్ ఉదయ్ పూర్ లోని ఓ హోటల్ లో సింపుల్ గా కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే పెళ్లి చేసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఒక్క ఫోటో, ఒక్క వీడియో కూడా లీక్ అవ్వకుండా జాగ్రత్తపడ్డారు. మీడియాకి కూడా ఎలాంటి సమాచారం వెళ్లకుండా చూసుకున్నారు.
అయితే పెళ్లి జరిగిన రెండు వారాల తర్వాత తాప్సీ పెళ్లి నుంచి ఓ వీడియో లీక్ అయింది. ఈ వీడియోలో తాప్సీ డప్పుల వాయిద్యాల మధ్య డ్యాన్స్ చేసుకుంటూ నడుస్తూ వస్తుంది. తాప్సీ వచ్చి మథియాస్ ని కౌగలించుకొని అనంతరం ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. తాప్సీ పెళ్లి వీడియో వైరల్ అవ్వడంతో తాప్సీ నిజంగానే పెళ్లి చేసేసుకుందని క్లారిటీ వచ్చేసింది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో మరోసారి పలువురు నెటిజన్లు ఈ జంటకి కంగ్రాట్స్ చెప్తున్నారు.ఎవరో కావాలనే ఈ వీడియోను లీక్ చేసినట్టు అనిపిస్తోంది
ఇక ఈ వీడియోలో ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో, కళ్లద్దాలు పెట్టుకొని ఉంది తాప్సి. ఆమెను ఊరేగింపుగా మథియాస్ వద్దకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో తాప్సి డాన్స్ కూడా చేసింది. మథియాస్ దగ్గరకు వచ్చిన వెంటనే అతడ్ని కౌగలించుకొంది. ఇద్దరూ దండలు మార్చుకున్నారు. ఆ వెంటనే పెళ్లికొచ్చిన అతిథులంతా నూతన వధూవరులపై పూలవర్షం కురిపించారు. ఈ వీడియోతో తాప్సి పెళ్లి చేసుకుందనే విషయం బయటకొచ్చింది. అటు తాప్సి మాత్రం ఇప్పటికీ తన పెళ్లి విషయాన్ని ప్రస్తావించడం లేదు. పెళ్లయిన వారం రోజులకే ఆమె తన కొత్త సినిమా పనుల్లో బిజీ అయింది. తాజాగా ఫొటోషూట్ లో కూడా పాల్గొంది.
తాప్సీ ఝుమ్మంది నాదం సినిమాతో కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. సౌత్‌తో పాటు హిందీ సినిమాల్లోనూ స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సొంతం చేసుకుంది. 2010 సంవత్సరంలో సినిమా కెరీర్‌ను ఆరంభించింది తాప్సీ. తెలుగులోనే కాకుండా అనేక ఇతర దక్షిణాది భాషా సినిమాల్లో నటించింది. ఇక 2013 సంవత్సరంలో చష్మే బద్దూర్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఢిల్లీలోని సిక్కు కుటుంబంలో జన్మించిన, పన్ను తండ్రి దిల్ మోహన్ వ్యాపారవేత్త. ఆమె తల్లి నిర్మల్జీత్ గృహిణి. తాప్సీ 8 సంవత్సరాల వయస్సు నుంచి భరతనాట్యం నేర్చుకుంది. అంతేకాదు ఆమె శిక్షణ పొందిన స్క్వాష్ క్రీడాకారిణి. ఢిల్లీలోనే ఎక్కువగా చదువుకున్న తాప్సీ కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ పట్టా పొందింది. ఆమె సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పలు ఐటీ దిగ్గజ కంపెనీల్లో విధులు నిర్వర్తించింది. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే మోడలింగ్‌పై మక్కువ పెంచుకుంది. ఆపై సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది
తాప్సీ మాట్లాడుతూ.. తాను ప్రతి నెల డైటీషియన్‌కు లక్షల్లోనే ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంలో తన తల్లిదండ్రులు ఎప్పుడూ తనను తిడుతుంటారని.. ప్రస్తుతం తాను ఉన్న వృత్తిలో ఇలాంటి ఖర్చు ఉండాల్సిందేనన్నారు తాప్సీ. ది లాలాన్‌టాప్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సీ తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది. తన తండ్రి ఎప్పుడూ డబ్బు పొదుపు చేయాలని అంటుంటారని.. జీవితమంతా డబ్బు ఆదా చేసినా.. తన కోసం ఎలాంటి ఖర్చులు చేయరని చెప్పింది. ఇక ప్రతిసారి తనను డైటీషియన్ విషయంలో తన తల్లిదండ్రులు కోప్పడుతుంటారని చెప్పుకొచ్చింది.
అయితే ఇప్పటి వరకు ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టిన హీరోయిన్లు, యంగ్ బ్యూటీలు నాజుగ్గా తయారయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పర్ఫెక్ట్ ఏబీఎస్ (ABS)ను సాధించేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం తాను సినీరంగంలో ఉన్నానని.. తన జీవితంలో ఎక్కడా ఉన్నాను అనేదానిపై తన ఆహారం.. జీవనశైలీ ఆధారపడి ఉంటుందని అన్నారు. ప్రతి నాలుగు లేదా ఐదు సంవత్సరాలకు శరీరంలో మార్పులు వస్తుంటాయని.. అలాగే అనేక నగరాలు, దేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామనే విషయంలో నిపుణుల సలహాలు చాలా అవసరమని అన్నారు.
తన తండ్రి ఎప్పుడూ డబ్బు పొదుపు చేయాలని అంటుంటారని.. జీవితమంతా డబ్బు ఆదా చేసినా.. తన కోసం ఎలాంటి ఖర్చులు చేయరని చెప్పింది. ఇక ప్రతిసారి తనను డైటీషియన్ విషయంలో తన తల్లిదండ్రులు కోప్పడుతుంటారని చెప్పుకొచ్చింది. ప్రతి నెలా డైటీషియన్ ఖర్చు ఎంత అని యాంకర్ ప్రశ్నించగా.. కొన్ని సెకన్లపాటు తడబడిన తాప్సీ.. ఆ తర్వాత నెలకు దాదాపు రూ. లక్ష అని చెప్పింది.