స్టూడెంట్ నెం.1 రిలీజ్ అయిన వెంటనే.. రాజమౌళికి ఊహించని షాక్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఏంటో తెలుసా?

Published : Apr 04, 2024, 04:47 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR)కు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)కి ఎంత మంచి బంధం ఉంటుందో తెలిసిందే. కానీ తారక్ ఓసారి మాత్రం జక్కన్నను ఆందోళనకు గురి చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.

PREV
16
స్టూడెంట్ నెం.1 రిలీజ్ అయిన వెంటనే.. రాజమౌళికి ఊహించని షాక్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఏంటో తెలుసా?

గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ చివరిగా ‘ఆర్ఆర్ఆర్’ (RRR)తో అలరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా తారక్ క్రేజ్ పెరిగిపోయింది.

26

నెక్ట్స్ ‘దేవర’ (Devara)  చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అక్టోబర్ 10న ఈచిత్రం వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది.

36

ఇదిలా ఉంటే.. నెట్టింట తారక్ గురించి ఎప్పుడూ ఏదో ఇంట్రెస్టింగ్ టాపిక్ వైరల్ అవుతూనే ఉంటుంది. ఈక్రమంలో తాజాగా ఎన్టీఆర్ - జక్కన్నకు మధ్య జరిగిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

46

అది కూడా నటుడు కనకాల రాజీవ్ ఆ విషయాన్ని బయటపెట్టారు. ఎన్టీఆర్ ఎంత సరదాగా ఉంటారో ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ తో అందరికీ తెలిసిందే. ఇక తనకు ఇష్టమైన వారితో మాత్రం చాలా స్పెషల్ గా ఉంటారంట.

56

తారక్ కు ఇష్టమైన వారిలో ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) ఒకరు. వీరిద్దరి కాంబోలో మొత్తం నాలుగు సినిమాలు వచ్చాయి. మొదట ‘స్టూడెంట్ నెం.1’ వచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీ పూర్తయ్యాక.. ఎన్టీఆర్, జక్కన్నను ప్రాంక్ చేశాడంట.

66

రాజీవ్ కనకాలతో పాటు కారులో వెళ్లి ఓ ఇంటర్నెట్ కేఫ్ లో ముఖ్యమైన పనిమీద ఉన్న జక్కన్నను డిస్టబ్ చేశారంట. మాయమాటలు చెప్పి కారులో బయటికి తీసుకెళ్లి ఆటపట్టించారంట. ఆ రోజంతా క్వాలిటీ టైమ్ ను గడిపారంట. ఇక జక్కన్న దర్శకత్వంలో ఎంతో సిన్సియర్ గా పనిచేసే తారక్ ఇలా సరదాగా ఆటకూడా పట్టిస్తారంట. ఇది వీరిద్దరి బంధానికి ఓ ఉదాహరణగా చెప్పారు.

Read more Photos on
click me!

Recommended Stories