Swayamvaram Movie Review: భర్తతో కాపురం చేయలేక, లవర్ ని వదులుకోలేక అమ్మాయి ఏం చేసిందంటే..

Published : Oct 15, 2026, 07:05 PM IST

Swayamvaram: ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. పెద్దలు ఒప్పుకోకపోతే ఎదిరిస్తారు. కానీ ఓ అమ్మాయి సంప్రదాయాల మధ్య భర్తతో ఉండలేక, ప్రియుడిని వదల్లేక నలిగిపోయింది. చివరకు భర్త చేసిన త్యాగాన్ని40 ఏళ్ల క్రితం వెండితెరపై చూపించారు. ఆ సినిమా ఏంటో తెలుసా?

PREV
14
గాలి వానలో..’ పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది

అసలు ఈరోజుల్లో ప్రేమ, త్యాగం, సంప్రదాయాలు అనే మాటకు అర్థం లేకుండా పోయింది. ఎందుకంటే ప్రేమ కోసం త్యాగం చేసేవాళ్లని చూసుంటాం కానీ...ప్రేమ కోసం మనుషుల ప్రాణాల్ని తీయడం ఈ జనరేషన్ లో కామన్ అయిపోయింది. ప్రియుడితో లేచిపోవడం కోసం పెళ్లి చేసుకున్న భర్తల్ని చంపేస్తున్నారు. అమ్మానాన్నల్ని పొట్టనపెట్టుకుంటున్నారు. సంప్రదాయాలకు పాతరేస్తున్నారు.

ప్రేమించిన వ్యక్తితోనే జీవితం పంచుకోవాలనుకోవడం ఒకరి కోరిక. కుటుంబం, సంప్రదాయాలు, సమాజం కోసం ఆ కోరికను పక్కన పెట్టడం మరొకరి పరిస్థితి. ఈ రెండింటి మధ్య చిక్కుకున్నప్పుడు ఆ మనిషి పడే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది? ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక.. కట్టుకున్న భర్తతో మనస్ఫూర్తిగా కాపురం చేయలేక ఓ మహిళ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది? ఇలాంటి సున్నితమైన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన చిత్రమే శోభన్ బాబు, జయప్రద నటించిన ‘స్వయంవరం’. దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన ఈ సినిమా 1982లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘గాలి వానలో..’ పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

24
కథ కంటే పరిస్థితులే ముఖ్యం!

దాసరి నారాయణరావు సినిమాల్లో కుటుంబ సంబంధాలు, మనుషుల మధ్య సంఘర్షణలు, సమాజంలో కనిపించే సమస్యలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కేవలం వినోదం అందించడమే కాకుండా.. కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులను ఆలోచింపజేసే అంశాలను కూడా ఆయన తన సినిమాల్లో చర్చించేవారు. ‘స్వయంవరం’లోనూ ప్రేమ, పెళ్లి, కుటుంబ పెద్దల నిర్ణయాలు, సంప్రదాయాల మధ్య వ్యక్తిగత కోరికలు ఎలా నలిగిపోతాయనే కోణం కనిపిస్తుంది.

ఈ కథలో శేఖర్‌గా శోభన్ బాబు, ప్రియగా జయప్రద నటించారు. ఒకరినొకరు ఇష్టపడే ఇద్దరి జీవితాల్లో కుటుంబ పరిస్థితులు, అపార్థాలు, పెద్దల నిర్ణయాలు అడ్డంకులుగా మారతాయి. ప్రేమించిన వ్యక్తితో కలిసి జీవించాలనే ఆశ ఉన్నప్పటికీ.. పరిస్థితులు అనుకూలించకపోవడంతో జీవితాలు మరో మలుపు తిరుగుతాయి.

34
కథలో ట్విస్ట్ అదే..

ఈ కథలో మరో ట్విస్ట్ ఏంటంటే...జయప్రద భర్తగా దాసరి గారు యాక్ట్ చేస్తారు. ప్రియ తండ్రి ఆమెకు రాజశేఖరం (దాసరి నారాయణరావు)తో పెళ్లి చేస్తాడు. అయితే రాజశేఖరం వ్యక్తిగత జీవితం, అతడి అలవాట్లు ప్రియకు భిన్నంగా ఉంటాయి. ఆమె మనసులో మాత్రం శేఖర్‌ ఉంటాడు. మరోవైపు శేఖర్‌ కూడా ప్రియ తనను మోసం చేసిందని భావిస్తూ బాధపడుతుంటాడు.

తన భార్య మనసులో మరొకరికి స్థానం ఉందని రాజశేఖరానికి తెలిసిన తర్వాత కథ కీలక మలుపు తిరుగుతుంది. తన గత జీవితాన్ని కూడా అతడు ఆత్మపరిశీలన చేసుకుంటాడు. చివరకు ప్రియ, శేఖర్‌ ఒకటవ్వాలని కోరుకుంటూ తన జీవితాన్ని ముగించుకుంటాడు. అతడి చివరి కోరిక మేరకు ప్రియ, శేఖర్‌ కలిసే అవకాశం ఏర్పడుతుంది.

44
ఈ సినిమాతో దాసరి ఏం చెప్పాలనుకున్నారంటే..

సంప్రదాయాల మధ్య ఎంతో మంది పెద్దవాళ్ల కోసం ప్రేమను త్యాగం చేస్తున్నారు. అటు భర్తతో కలిసి ఉండలేక, ప్రియుడితో వెళ్లలేక నరకయాతన అనుభవిస్తున్నారు. మందుకు, పరాయి ఆడవాళ్లతో తిరిగే తన లాంటి వాడి కోసం తన ప్రేమను ఎందుకు త్యాగం చేయాలని చెప్పి తప్పు తెలుసుకుని, తాను మరణించి ప్రేమికులను కలుపుతారు. కానీ ఈ రోజుల్లో అలా ఎక్కడ జరుగుతుంది. కావాలంటే భర్తల్నే చంపేస్తున్నారు. ఈ సినిమా చూడాలనుకుంటే యూట్యూబ్ లో ఉంది చూడొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories