ప్రస్తుతం బాలీవుడ్ లో బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. బాలీవుడ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండటం, చిన్న చిన్న హీరోలతో పాటు.. స్టార్ హీరోలు కూడా ఫెయిల్యూర్ బాట పడుతుండటంతో పాటు.. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు.. దీనికి తోడు బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్ తో మరింత ఎదురుదెబ్బ తగులుతుంది. ఈ విషయంలో స్పందించిన స్వర భాస్కర్ ఇది కావాలనే చేస్తున్నారంటూ కామెంట్స్ చేసింది.