‘లైగర్’ నష్టాలను పూడ్చేందుకు విజయ్ తీసుకున్న నిర్ణయం.. ప్రొడ్యూసర్స్ కు ఎంత తిరిగిచ్చాడు.?

First Published Sep 4, 2022, 1:30 PM IST

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబినేషనల్ లో వచ్చిన ‘లైగర్’ భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. దీంతో ప్రస్తుతం ప్రొడ్యూసర్లు వాటిని పూడ్చే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ కూడా తన రెమ్యూనరేషన్ తిరిగిచ్చినట్టు తెలుస్తోంది.
 

సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ ‘లైగర్’. రిలీజ్ కు ముందుకు భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం..  నెగెటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. ఫలితంగా నిర్మాతలకు భారీ నష్టాలు తెచ్చి పెట్టింది. 
 

Liger చిత్రాన్ని పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్ బ్యానర్లపై నిర్మాత కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ కలిసి నిర్మించారు. చిత్రాన్ని రూ. 90 నుంచి 125 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా నిలిచింది. దీంతో నష్టాలు చవిచూడాల్సి వస్తోంది.

తొలిరోజు మాత్రమే చిత్రం  రూ. 23 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి కాస్తా పర్లేదు అనిపించింది. నెగెటివ్ టాక్ రావడంతో తర్వాత రోజునుంచి పూర్ కలెక్షన్లతో ‘లైగర్’ ముందుకు కదలేకపోయింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.55 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందని తెలుస్తోంది. ఈ లెక్కన మరో 50 కోట్ల వరకు లాస్ లోనే ఉంటుంది.

అయితే, ప్రస్తుతం ప్రొడ్యూసర్లు నష్టాలను పూడ్చే పనిలో పడ్డారు. లాస్ లో పాలుపంచుకుంటామని ఇప్పటికే పూరీ, ఛార్మీ బయ్యర్లకు హామీనిచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ కూడా నష్టాలను పూడ్చేందుకు నిర్మాతలకు సహకరిస్తున్నట్టు తెలుస్తోంది.  తన రెమ్యూనరేషన్ నుంచి కొంత తిరిగిచ్చినట్టు తెలుస్తోంది. 
 

మంచి ఫామ్ లో ఉన్న విజయ్ దేవరకొండ ‘లైగర్’ కోసం మూడేండ్లకు కలిసి రూ.30 కోట్లకుపైగా తీసుకున్నట్టు తెలుస్తోంది. సినిమా నష్టాలు తెచ్చిపెట్టడంతో తన రెమ్యూనరేషన్ నుంచి రూ.6 కోట్లు తిరిగివ్వాలని  నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇలాగైనా పూరీ, ఛార్మీకి ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలని భావిస్తున్నాడంట. 

అదేవిధంగా,  పూరీతో తన తదుపరి చిత్రం 'జన గణ మన' చేయబోతున్నాడు. ‘లైగర్’తో నష్టపోవడంతో పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ కు ఆర్థిక ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. అయితే జనగణమనకు విజయ్, పూరీ, తమ జీతాలు తీసుకోకుండా వర్క్ చేయాలని భావిస్తున్నారంట. సినిమా సక్సెస్ అయితే తర్వాత లాభాల్లో కొంత భాగాన్ని తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

click me!