ఇది మరిచిపోయినట్లుగా ఉన్నావు అంటూ అగ్గిపెట్టి చేతిలో పెడతాడు కృష్ణమూర్తి. అగ్గిపెట్టి స్వప్న చేతిలో లాక్కొని తల్లిదండ్రులని మందలిస్తుంది కావ్య. కాలికి దెబ్బ తగిలితే కాలిని నరికేసుకుంటామా అయినా లేచిపోయేంత తెలివితేటలు దీనికి లేవు. ఎవరో దీనిని మోసం చేశారు. ఏదిక్కు లేక మన ఇంటికి వచ్చింది మనం కూడా తరిమిస్తే ఏమవుతుంది అంటూ నచ్చ చెప్తుంది కావ్య. ఇది పాములాంటిది దీనిని చేరదీస్తే మనమీదే విషం కక్కుతుంది అంటాడు కృష్ణమూర్తి. అప్పు, కనకం కూడా అదే మాట చెప్తారు. దయచేసి అందరూ నా మాట వినండి మనం కూడా తనని ఆదరించకపోతే అక్క దిక్కులేని పక్షి అయిపోతుంది అంటుంది కావ్య.