అలాగే అని చెప్తాడు కానీ పశ్చాతాపంతో కన్నీరు పెట్టుకుంటూ ఉంటాడు. నా గుండెలో నిండా ప్రేమ ఉంది కానీ అది మీ జీవితానికి అడ్డు కాకూడదు అనుకుంటాడు. నా గురించి నేను తీసుకున్న నిర్ణయం కాదు నీ గురించి ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఆ విషయం తర్వాత నీకే అర్థమవుతుంది అనుకుంటాడు యష్. మరోవైపు తను అందంగా రెడీ అయ్యి రూమ్ ని అందంగా డెకరేట్ చేస్తుంది వేద. ఈ రూమ్ ఇలా చూసి ఆయన ఎంత ఆనందపడతారో, త్వరగా ఇంటికి వచ్చేయండి అనుకుంటుంది.