
ఎపిసోడ్ ప్రారంభంలో స్వప్నని చూసి షాక్ అవుతాడు రాహుల్. మరోవైపు కనకం ఇంటికి అప్పు వసూలు చేయడానికి తమ్ముణ్ణి పంపిస్తాడు చంపక్ లాల్. అతన్ని చూసి కంగారు పడుతుంది కనకం. మా ఆయనకు తెలిస్తే చంపేస్తాడు అల్లుడు గారికి తెలిస్తే అసహ్యంగా ఉంటుంది అనుకుంటూ అతన్ని తీసుకొని పక్కకి వెళ్లి ఎందుకు వచ్చావు అని కంగారుగా అడుగుతుంది. వడ్డీ కోసం వచ్చాను అంటాడు అతను. అంతలోనే బయటికి వస్తున్న రాజ్ ని ఆపి ఏమైనా కావాలా అని అడుగుతాడు కృష్ణమూర్తి. ఉక్క పోతతో చచ్చిపోతున్నాను అంటాడు రాజ్. కావ్యని పిలిచి అల్లుడు గారికి స్నానానికి ఏర్పాట్లు చేయు ఒళ్ళు చల్లబడుతుంది అంటాడు కృష్ణమూర్తి. మరోవైపు నేను మీ దగ్గరికి వచ్చి వడ్డీ కడతాను అంటుంది కనకం.
కట్టకపోతే ఇల్లు ని లాక్కుంటాను అంటూ హెచ్చరిస్తాడు సేటు. అలాగే చేస్తాను అల్లుడు తెలిస్తే పరువు పోతుంది అని చెప్పి అతని అక్కడి నుంచి పంపించేస్తుంది కనకం ఇదంతా కృష్ణమూర్తి చూస్తాడు. కనకం కూడా కృష్ణమూర్తిని చూసి షాక్ అవుతుంది. వాడు మన ఇంటికి ఎందుకు వచ్చాడు అని భార్యని నిలదీస్తాడు కృష్ణమూర్తి. అల్లుడిని పరిచయం చేసుకుందామని వచ్చాడు. ఆయన చిరాగ్గా ఉన్నారు అని చెప్తే వెళ్ళిపోతున్నాడు అంటూ అబద్ధం చెప్తుంది కనకం. సరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కృష్ణమూర్తి. మరోవైపు ఎక్కడికెందుకు వచ్చావు అంటూ స్వప్నని కసురుకుంటాడు రాహుల్. మా చెల్లిని క్షమించిన మీ ఇంట్లో వాళ్ళు నన్ను కూడా క్షమిస్తారు వెళ్లి నాకు ఎర్రనీళ్లతో దిష్టి తీయమను అంటుంది స్వప్న. ఏంటి ఆటలుగా ఉందా అంటాడు రాహుల్.
ఆటలాడుతుంది నువ్వా నేనా ఆ మాత్రం బాధ్యత లేదా అంటూ చివాట్లు పెడుతుంది స్వప్న. తాళి కట్టి ఇంటికి తీసుకు వెళ్తావా లేదా అంటూ నిలదీస్తుంది. మీ చెల్లెలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఇంట్లో నీ పేరు చెప్తేనే భగ్గుమంటున్నారు. కాస్త ఓపిక పట్టు అంటాడు రాహుల్. అసలు నా చెల్లెలు నాకు పెద్ద శత్రువు నేను మా ఇంటికి వెళ్తాను తర్వాత తను ఎలా సుఖంగా కాపురం చేసుకుంటుందో చూస్తాను అంటుంది స్వప్న. మీ ఇంటికి వెళ్ళకు మీ ఇంట్లో రాజ్, కావ్య ఇద్దరు ఉన్నారు అంటాడు రాహుల్. ఇంతలోనే రుద్రాణి వాళ్ళిద్దరినీ చూస్తుంది. తను ఎవరు అని రుద్రాణి అడిగితే తెలియదు అడ్రస్ అడిగితే చెప్తున్నాను అంటాడు రాహుల్. తాతయ్య చూస్తే బాగోదు త్వరగా పంపించు అంటుంది రుద్రాణి. సరే అంటూ వెనక్కి తిరిగి ప్రస్తుతానికి ఎక్కడైనా ఉండు అంటూ స్వప్నని పంపించేస్తాడు రాహుల్.
మా అమ్మకి నేనంటే ఇష్టం నేను మా ఇంటికి వెళ్తాను అనుకుంటుంది స్వప్న.మరోవైపు స్నానానికి వెళ్లిన రాజ్ బాత్రూంలో కాలుజారి పడతాడు. ఒక్కసారిగా రాజ్ వేసిన కేకకి ఇంట్లో వాళ్ళందరూ కంగారుగా బాత్రూం దగ్గరికి వస్తారు. కావ్య, అప్పు ఇద్దరూ తోడుపట్టి గదిలోకి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెడతారు. అల్లుడు కాలుజారిపడ్డాడు అంటూ శోకాలు పెడుతుంది మీనాక్షి. నేను కాలు జారాను అని నోరు జారకండి జనాలు వేరేగా అర్థం చేసుకుంటారు అంటూ ఇబ్బందిగా అంటాడు రాజ్. అల్లుడుగారు కాలు జారిపడ్డారని వాళ్ళ అమ్మ గారికి తెలిస్తే మన పరిస్థితి ఏమవుతుంది మళ్లీ పంపించమంటే నోరు జారుతారు అంటూ కంగారు పడుతుంది కనకం. ఇకనుంచి పంపిస్తావా లేకపోతే నన్నే దేక్కుంటూ మా ఇంటికి వెళ్లిపోమంటావా రాజ్.
అందరూ బయటికి వెళ్ళండి పెద్దమ్మ నేను చూసుకుంటాను అంటుంది కావ్య. వాళ్ళందరూ వెళ్లిపోయిన తర్వాత నడుం మీద ఒక్క కరాటే కిక్కు కొడితే దెబ్బకి సెట్ అయిపోతుంది అంటుంది అప్పు. సెట్ అయిపోతుందా నడుము విరిగిపోతుందా నువ్వు ముందు బయటికి పో అంటూ మరదలు మీద కోప్పడతాడు రాజ్. జాగ్రత్త అంటూ ఆమె కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.ఇలాంటివి జరుగుతాయని నేను మిమ్మల్ని వెళ్ళిపోమన్నాను అంటుంది కావ్య. మీకు కాపడానికి వేడి నీళ్లు పెట్టుకొస్తాను అంటూ వెళ్తున్న కావ్యతో వేడి నీళ్లు లేకపోయినా పర్వాలేదు కానీ మీ పెద్దమ్మ వాళ్ళని లోపలికి రానివ్వకు చాలు అంటాడు రాజ్. మరోవైపు కళ్యాణ్ ఫోన్ చేస్తే అప్పు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. నువ్వా బ్రో అంటాడు కళ్యాణ్. బ్రో అన్నందుకు కోప్పడుతుంది అప్పు.
నువ్వు అమ్మాయిలాగా మాట్లాడితే నిన్ను అమ్మాయిలాగా ట్రీట్ చేస్తాను అంటాడు కళ్యాణ్. నన్ను అలా చూడకూడదని అబ్బాయిలాగా పెరిగాను ఇంతకీ విషయం చెప్పు అంటుంది అప్పు. మా అన్నయ్య ఎలా ఉన్నాడు అని అడుగుతాడు కళ్యాణ్. కాలుజారి నడ్డి విరగొట్టుకున్నాడు అంటుంది అప్పు. హాస్పిటల్ కి తీసుకెళ్ళారా అని అడుగుతాడు కళ్యాణ్. రాను అన్నాడు అంటుంది అప్పు.మరి ఎలా అంటూ కంగారు పడతాడు కళ్యాణ్.మా అక్క చూసుకుంటుంది నువ్వేమీ కంగారు పడకు అంటుంది అప్పు. అంతలోనే అప్పు కళ్యాణ్తో మాట్లాడుతుందని తెలుసుకొని ఫోన్ లాక్కొని అంత పెద్ద ప్రమాదమేమీ కాదు బాబు అంటూ సర్ది చెప్తుంది కనకం. తరువాయి భాగంలో రాజ్ కి నడుముకి మర్ధనా చేస్తూ ఉంటుంది కావ్య. అంతలోనే అక్కడికి వచ్చిన అపర్ణ ఆ సీన్ చూసి రాజ్ ని కోప్పడుతుంది. అత్తింట్లోనే కొడుక్కి నానా చివాట్లు పెడుతుంది.