ఏడాదిగా జీవితంతో ఎంత పోరాడుతున్నావో ఎవరికీ తెలియదు.. సమంత గురించి విజయ్ సుధీర్ఘమైన నోట్..

First Published | Apr 14, 2023, 12:06 PM IST

స్టార్ హీరోయిన్ సమంత నటించిన ‘శాకుంతలం’ రిలీజ్ సందర్భంగా.. తాజాగా విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ నోట్ విడుదల చేశారు. సామ్ గురించి ఆసక్తికరంగా స్పందించారు. 
 

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘శాకుంతలం’ (Shaakuntalam). గుణశేఖర్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మించారు. దేవ్ మోహన్ - సామ్ జోడీగా నటించిన ఈ చిత్రం ఇవాళ (April 14)న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
 

అయితే, చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదలైన సందర్భంగా  టాలీవుడ్ తారలు సమంతకు మరియు ‘శాకుంతలం’ టీమ్ కు ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నారు. ఈక్రమంలో విజయదేవరకొండ సామ్ గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఒకటి చేయడం వైరల్ గా మారింది. 
 


విజయ్ దేవరకొండ విడుదల చేసిన నోట్ లో.. ‘సామీ.. నువ్వు ఎంతో ప్రేమగా ఉంటావు. ఎప్పుడూ సరైన పనిచేస్తుంటావు. ఉత్సాహంగానూ ఉంటారు.  ఇప్పటికీ సినిమాలో ప్రతి షాట్ కోసం నువ్వు బెస్ట్ అందిస్తున్నావు. దానిపైనే నీ కేరీర్ ఆధారపడి ఉంది.  కానీ ఏడాదిగా నువ్వు జీవితంలో ఎంత ఫైట్ చేస్తున్నావో ఎవరికీ తెలియకపోవవ్చు. అయినా ఎప్పుడూ నవ్వుతూ, సినిమాల కోసం ముందడు వేస్తూనే ఉన్నావు. 
 

నీ శరీరం విశ్రాంతి తీసుకోమని చెబుతున్నా.. పనికి బ్రేక్ అవసరం ఉందని చెబుతున్నా ముందుకెళ్తూనే ఉన్నావు. ఇలాంటి తరుణంలో విడుదలవుతున్న ‘శాకుంతలం’ విజయంతం  కావాలని ఆకాంక్షిస్తున్నాను. నీ పట్టుదల, లక్షలాది మంది అభిమానుల ప్రేమ నిన్ను ఎల్లప్పుడూ సురక్షితంగానే ఉంచుతుంది. అంతా మంచే జరుగుతుంది. ప్రేమతో విజయ్’ అంటూ సుధీర్ఘమైన నోట్ ను విడుదల చేశారు.
 

ఇది చూసిన సామ్ విజయ్ దేవరకొండకు రిప్లై ఇచ్చారు.  ‘ఇలాంటి సమయంలో నాకు కావాల్సింది ఇదే.  మాటలు కూడా రావడం లేదు. థ్యాంక్యూ మై హీరో’ అంటూ బదులిచ్చింది. ప్రస్తుతం వీరి సంభాషణ నెట్టింట వైరల్ గా మారింది. అటు అల్లు అర్జున్, బాలీవుడ్ ద్వయం దర్శకులు రాజ్ అండ్ డీకే లు కూడా సమంతకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. 
 

విజయ్ దేవరకొండ - సమంత జంటగా     ‘ఖుషి’(Kushi)లో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శక్తవం వహిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. సెప్టెంబర్ 1న థియేటర్లలో విడుదల కానుంది.  మరోవైపు సమంత ‘ఫ్యామిలీ మెన్’ సిరీస్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలోని ‘సిటడెల్’ సిరీస్ లో నటిస్తున్నారు. 
 

Latest Videos

click me!