చిట్టి డాక్టర్ని మందలించి అక్కడి నుంచి పంపించేస్తుంది. రాహుల్ కూడా స్వప్న మీద కేకలు వేస్తాడు. ఇన్నాళ్లు ఈ నిజం నాకెందుకు చెప్పలేదు, ఎందుకు ఇంత మోసం చేశావు అని అడుగుతాడు. మోసం అనేది ఈ రోజు కొత్తేమీ కాదు కదా రాహుల్, ఏ తల్లి పెంపకంలో పెరిగింది, చెట్టు ఒకటి అయితే విత్తనం మరొకటి అవుతుందా అంటూ కోపంగా కనకం వైపు చూస్తూ అంటుంది అపర్ణ. అమ్మ నేను పెళ్లి చేయడం కోసం అబద్ధం చెప్పాను.