ఎపిసోడ్ ప్రారంభంలో సీతారామయ్య తనని గమనించాలని అతనికి ఏదో ఒకటి ఇస్తూ అతని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కావ్య. ఇది ఎందుకంత ఓవరాక్షన్ చేస్తుంది ఏదో నా కొంప ముంచేలాగా ఉంది అనుకుంటాడు రాజ్. మీకు ఏం కావాలన్నా నన్ను అడగండి ఈరోజు అంతా నేను కిచెన్ లోనే ఉంటాను అంటుంది కావ్య. అదేంటమ్మా ఈరోజు మీ ఇంటికి వెళ్లి పని చేస్తాను అన్నావు కదా అంటాడు సీతారామయ్య. అప్పుడు కావ్య ఎందుకలా ప్రవర్తిస్తుందో అర్థం చేసుకుంటాడు రాజ్.