ఎపిసోడ్ ప్రారంభంలో ఈ న్యూస్ చూసి నాకు చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు సమాధానం చెప్పలేక సిగ్గు పడిపోతున్నాను అంటాడు శైలేంద్ర. నిన్ను ఎవరు అడుగుతున్నారో నాకు చెప్పు నువ్వు బోర్డు నెంబర్ అని ఇక్కడ ఎవరికీ తెలీదు అంటాడు మహేంద్ర. అదంతా నాకు అనవసరం ముందు దీనికి సమాధానం చెప్పండి నేను ఆరోజు చెప్పాను పిన్ని కాలేజీకి హ్యాండిల్ చేయలేదని అందుకే బాధ్యతని వేరే వాళ్ళకి ఎవరికైనా అప్పజెప్పండి అంటే నా మాట వినలేదు అంటాడు శైలేంద్ర.