Karthika Deepam: షాకింగ్ ట్విస్ట్.. హిమను కనిపెట్టిన శౌర్య.. ఆమెను బాధపెట్టాలని పక్కా ప్లాన్?

Published : Mar 31, 2022, 08:44 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకుపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
17
Karthika Deepam: షాకింగ్ ట్విస్ట్.. హిమను కనిపెట్టిన శౌర్య.. ఆమెను బాధపెట్టాలని పక్కా ప్లాన్?

హిమ (Hima) ను సౌర్య టిఫిన్ సెంటర్ దగ్గరికి తీసుకుని వచ్చి స్వయంగా హిమ మొహం కడుగుతుంది. దాంతో హిమ మనసులో ఎంతో ఆలోచన వ్యక్తం చేస్తోంది. మరోవైపు సౌందర్య (Soundarya) హిమ చిన్నప్పుడు ఫోటోను పట్టుకొని గుడిలో వెతుకుతూ ఉంటుంది.
 

27

ఇక టిఫిన్ సెంటర్ లో పనిచేసే ఒక అబ్బాయికి జ్వాలా (Jwala) రవ్వ ఇడ్లి అని పేరు పెడుతుంది. ఇక జ్వాల హిమ (Hima) ను ఆ విధంగా గట్టిగా పిలవమని చెబుతుంది. సౌర్య రవ్వ ఇడ్లి అని టిఫిన్ సెంటర్లో గట్టిగా అరుస్తుంది. దాంతో అందరూ ఆశ్చర్యపోయి ఆమె వైపు చూస్తారు.
 

37

మరోవైపు ప్రేమ్ (Prem) తల్లి ప్రేమ్ ను తన దగ్గరే ఉండమని అంటుంది. ఇక ప్రేమ్ మరి నాన్న ను ఎవరు చూసుకుంటారు అని అంటాడు. అంతే కాకుండా ఈ విషయంలో నీకు ఒక న్యాయం అమ్మమ్మకు ఒక న్యాయమా అని ప్రేమ్ అంటాడు. ఆ క్రమంలో స్వప్న (Swapna) ప్రేమ్ ను ఎంత కన్వీన్స్ చేయాలని చూసినా అస్సలు వినదు.
 

47

ఆ తర్వాత హిమ (Hima) ఆటోలో కళ్లు తిరిగి పడి పోతుంది. సౌర్య ఎంతో కంగారు పడుతూ హిమను సృహలోకి తీసుకురావడానికి చూస్తుంది. ఇక ఇదే క్రమంలో సౌందర్య (Soundarya) సౌర్య జాడను వెతుకుతూ వీళ్లిద్దరినీ చూసుకోకుండా వెళ్ళిపోతుంది.
 

57

మరోవైపు ఆనందరావు (Anand Rao) జరిగిన చేదు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోని.. సౌందర్య దేవుడు నాకు ఎక్కువ ఆయుష్షు ఇచ్చాడు ఏమో అని సౌందర్య కు చెబుతాడు. ఆ మాటతో సౌందర్య (Soundarya)  ఎంతో బాధపడుతుంది.
 

67

అదే క్రమంలో ఆనందరావు (Ananad rao) ఇంట్లో సంతోషాలు కావాలి.. ఇల్లంతా కళకల్లాడుతూ ఉండాలి అని అంటాడు. అంతేకాకుండా అది హిమ పెళ్లితోనే సాధ్యమవుతుందని ఆనంద్ రావు అంటాడు. దాంతో సౌందర్య (Soundarya) ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది.
 

77

మరోవైపు హిమ (Hima) సౌర్య గురించి మాట్లాడుతూ ఏడుస్తూ..  తన తల్లిదండ్రుల ఫోటోలకి దండం పెడుతూ ఉంటుంది. ఇక అదే క్రమంలో హిమ వాళ్ళ ఇంటికి వచ్చిన జ్వాలా (Jwala) అది చూసి ఒక్కసారిగా స్టన్ అవుతుంది. కాగా ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories