బుల్లి తెరపై రోజా క్రేజీ సెలబ్రిటిగా మారిపోయారు. జబర్దస్త్ షోతో పాటు పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. బుల్లితెరపై నవ్వులు పూయిస్తున్నారు. ప్రముఖ టీవీ ఛానల్ లో ఉగాది సందర్భంగా అంగరంగ వైభవంగా అనే స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రాం కి సంబందించిన ప్రోమో తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో రోజా, హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.