ఎన్టీఆర్ - ఏఎన్నార్ లకు చుక్కలు చూపించిన నటుడు ఎవరు..? ఆయనంటే ఎందుకు భయపడేవారు..?

First Published | Sep 24, 2024, 5:24 PM IST

ఎన్టీఆర్ - ఏఎన్నార్ లు ఎంత పెద్ద హీరోలో అందరికి తెలుసు.. ఇండస్ట్రీకి రెండు కళ్ల లాంటి ఆ ఇద్దరిని భయపెట్టిన నటుడు ఎవరో తెలుసా.? ఈ ఇద్దరు ఆ నటుడిని చూస్తే వణికిపోయేవారట.. ఇంతకీ ఎవరాయన..? 

ఎన్టీఆర్ - ఏఎన్నార్ తెలుగు సినిమా పరిశ్రమకు రెండు కళ్లు.. తెలుగు ప్రేక్షకులకు ఆరాధ్య నటుడు. ఇద్దరు లేకుండే తెలుగు పరిశ్రమ లేదు. టాలీవుడ్ హిస్టరీ  ఈ ఇద్దరు హీరోల ప్రస్తావన లేకుండా పూర్తవ్వదు. తెలుగు నటులకు.. తెలుగు వారికి ప్రపంచ  స్థాయి గుర్తింపును అప్పుడే తెచ్చిపెట్టిన మహానటుడు వీరిద్దరు. 
 

Also read:  జయసుధను జుట్టుపట్టి కొట్టిన హీరోయిన్ ఎవరు..?

సినిమాల పరంగా ఎన్టీఆర్ కంటే ముందే ఏఎన్నార్ ఇండస్ట్రీకి వచ్చినా.. ఆతరువాత అన్నగారు ఎదుగుదల ఫాస్ట్ గా జరిగింది. ఇక పౌరానిక, జానపద, మైథాలాజికల్ సినిమాల ద్వారా ఎన్టీఆర్ దేవుడయ్యాడు. ఆంధ్రులకు ఆరాధ్యుడయ్యాడు. 

అటు అక్కినేనివారుమాత్రం తెలుగు పరిశ్రమకు స్టైలీష్ ఐకాన్ గా నిలిచారు తెలుగు సినిమాతె వెస్ట్రన్ స్టెప్పులేయించిన మొదటి హీరో అక్కినేని నాగేశ్వరావు. అప్పటి యూత్ ను ఎట్రాక్ట్ చేస్తూ.. అద్భుతమైన సినిమాలు అందించారు. రొమాంటిక్ హీరోగా ఏఎన్నార్ కు పేరుంది. 

Also read: శోభన్ బాబు అత్తా అని పిలిచే హీరోయిన్..?


ఇలా ఈ ఇద్దరు హీరోల ఎన్నో సినిమాలు చేశారు. ఇద్దరి మధ్య ఎప్పటి కప్పుడు సినిమాల పరంగా పోటీ ఉండేది. ఒకసారి ఎన్టీఆర్ గెలిస్తే.. మరోసారి ఏఎన్నార్ గెలిచేవారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినా.. ఆతరువాత ఆప్యాయతగా కలిసిపోయే వారు ఎన్టీఆర్ - ఏఎన్నార్.

ఇక ఎన్టీఆర్ - ఏఎన్నార్ డేట్ల కోసం స్టార్ డైరెక్టర్లు పడిగాపులు కాసేవారు. ఇద్దరు ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండేవారు. అంతే కాదు గుండమ్మ కథ, మాయా భజార్ లాంటి అద్భుతమైన సినిమాలు ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించారు. ఎన్టీఆర్ - ఏఎన్నార్ కలిసి దాదాపు 15 సినిమాలకు పైగా నటించారు. ఈసినిమాలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవాలి. 

Also read: ప్రభాస్ నెంబర్ 1, మరి పాన్ ఇండియా హీరోగా సెకండ్ ప్లేస్ ఏ హీరోదో తెలుసా...?

ఇక అంత అద్భుతమైన నటులు.. తెలుగు సినిమాకు ఆధ్యులగా చెప్పబడే ఎన్టీఆర్ - ఏఎన్నార్ లు ఒక నటుడిని చూస్తే మాత్రం భయపడిపోయేవారట. ఆయన సెట్ లో ఉంటే.. పక్కనే కామ్ గా కూర్చునేవార ఎక్కడ తమను సినిమాలో తన పాత్రతో డామినేట్ చేస్తాడో అని భయపడిపోయేవారట. ఇక కాంతారావు, జగ్గయ్య లాంటివారయితే వణికిపోయేవారట. 

Also read: నాగార్జున భోజనం ప్లేటులో తప్పకుండా ఉండేవి ఏంటో తెలుసా..?

ఇంతకీ వీరందరిని భయపెట్టిన ఆ నటుడు ఎవరో మీరు ఇప్పటికే ఊహించే ఉంటారు కదా.. ఆయన మరెవరో కాదు ఎస్వీ రంగారావు. అవును ఎస్వీఆర్ అంటే ఎన్టీఆర్ - ఏఎన్నార్ లు భయపడేవారట. ఆయనతో సీన్ చేయాలి అంటే చాలా ప్రిపేర్ అయ్యేవారట

. ఎక్కడ తన నటన, డైలాగ్స్ తో డామినేట్ చేస్తాడా అని పక్కన కూర్చొని ఆలోంచించేవరట. ఎస్వీఆర్ కూడా అదే కాన్ఫిడెంట్ తో ఉండేవారట. ఎంత పెద్ద హీరో ఉన్నా.. తన నటనతో వారిని డామినేట్ చేసి.. డైలాగ్ ల ప్రవాహంతో ముంచెత్తేవారట.

ఎంత పెద్ద డైలాగ్ అయినా.. సింగిల్ టేక్ లో చేసి..అవతలివారికి మాట రాకుండా చేసేవారట ఎస్వీఆర్. దాంతో ఇతర నటులు.. హీరోలయినా కూడా ఎస్వీఆర్ తో సీన్ అంటే తెగ భయపడేవారట. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

ఇక ఈ విషయాన్ని గతంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో కైకాల సత్యనాయరణ గారు వెల్లడించారు. ఇక కైకాల లాంటి నటులయితే.. ఎస్వీఆర్ దగ్గరకు వెళ్లడానికి కూడా భయపడే వారట. ఈ విషయం తెలసుకుని అంతా ఆశ్చర్యపోతున్నారు. నిజంగా ఆయన అంత భయపెట్టేవారా అని అనుకుంటున్నారు ఆడియన్స్. 

ఇక ఎస్వీఆర్  చాలా కెరీర్ మిగిలి ఉండగానే గుండెపోటుతో మరణించారు. చెన్నైలో చాలా పెద్ద ఇల్లు కలిగిన ఆయన.. తాగుడు వల్ల ఆరోగ్యం కోల్పోయారు. ఆతరువాత గుండెకు ఆపరేషన్ చేయించుకున్న ఆయన.. డాక్టర్లు వద్దన్నా..నటించడం మొదలు పెట్టారు. కాగా ఓ రోజు షూటింగ్ నుంచి వచ్చి పడుకున్న ఎస్వీఆర్.. నిద్రలోనే గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. 

Latest Videos

click me!